రంగీలా ఊర్మిళ అంటే అప్పట్లో సెన్సేషన్. తెలుగులో ఓ రేంజ్ ఇమేజ్ అందుకున్న ఈ భామ.. రంగీలాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కామెడీ టైమింగ్ నుంచి యాక్టింగ్ స్కిల్ వరకూ ఈ భామలో చాలానే పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువగా ఈ బ్యూటీ గురించి చెప్పుకోవాల్సిన విషయం.. అద్భుతమైన డ్యాన్సింగ్ ట్యాలెంట్.
ఇప్పుడు ఇదంతా గతం అనుకోవాల్సిందే. బోలెడంత గ్యాప్ తీసుకుని ఊర్మిళ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా తనకు బాగా అచ్చొచ్చిన స్కిల్ అయిన.. డ్యాన్స్ పెర్ఫామెన్స్ చూపించే అవకాశం దక్కింది. ఇర్ఫాన్ ఖాన్ మూవీ బ్లాక్ మెయిల్ లో ఓ పబ్ లో సిట్యుయేషనల్ పరంగా వచ్చే ఐటెం సాంగ్ లో నటించింది ఊర్మిళ. 'బేవఫా బ్యూటీ' అంటూ సాగే ఈ పాటలో అటు పాడుతూ.. ఇటు డ్యాన్స్ చేస్తూ కనిపించింది ఈ సీనియర్ భామ. అమ్మడి కదలికలు చూస్తే సీనియర్ భామ అని అనక తప్పదు.
నడుం స్పీడ్ గా ఊపడం విషయంలో ఊర్మిళకు స్పెషల్ గుర్తింపు ఉంది. ఇప్పుడు బ్లాక్ మెయిల్ లో కూడా తన సిగ్నేచర్ స్టెప్స్ మాదిరిగా ట్రై చేసినా.. ఆ స్పీడ్ ఏమాత్రం కనిపించలేదు. రీసెంట్ గానే ప్రీతి జింటా తన సొట్ట బుగ్గలు కనిపించకపోవడం గురించి చెప్పినట్లుగా.. మనమందరం మారిపోతాం అనే పాయింట్ ను ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఊర్మిళా మండోద్కర్ లో ఒకనాటి వేగాన్ని ఆశించడం ఇప్పుడు అత్యాశే అవుతుందేమో!
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View