హీరోయిన్ వేసుకున్న బనియన్‌ బ్యాక్ స్టోరీ

Update: 2021-10-03 16:30 GMT
బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరోయిన్‌ రంగీలా ఫేమ్‌ ఊర్మిళ. ఈమె సుదీర్ఘ కాలం పాటు బాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా కొనసాగింది. ఈమె గత అనుభవాలను గుర్తులను ఈమద్య కాలంలో ఒక టాక్ షో లో పంచుకుంది. తన రంగీలా సినిమా గురించి ప్రతి సందర్బంలో చెప్పే ఊర్మిళ మరోసారి ఆ సినిమాలోని తన్హా తన్హా పాట గురించి మాట్లాడింది. సముద్ర తీరంలో హీరోయిన్ ఊర్మిళ మరియు హీరో జాకీ ష్రాఫ్‌ లపై పాటను చిత్రీకరించారు. ఆ పాటలో ఊర్మిళ ధరించిన డ్రస్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పాట లో ఊర్మిల ఒక బనియన్ మీద ఉంటుంది. వర్మ కు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు అంటూ అంతా ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటారు. ఆ బనియన్ ఐడియా జాకీ ష్రాఫ్‌ దిగా తాజాగా ఊర్మిళ చెప్పుకొచ్చింది. గతంలో ఒక సమయంలో కూడా వర్మ ఆ విషయాన్ని వెళ్లడించాడు.

ఆ పాట కోసం తన లుక్‌ చాలా స్పెషల్‌ గా ఉండాలని అనుకున్నారు. అందుకోసం చాలా కాస్ట్యూమ్స్ ను తీసుకు వచ్చారు. కాని ఏ ఒక్కటి కూడా నచ్చలేదు. చివరకు చాలా యూనిక్ గా ఉండేలా జాకీ ష్రాఫ్‌ తన బనియన్ ను వేసుకోవాలని సూచించాడు. అందుకు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఓకే చెప్పాడు. దాంతో ఊర్మిళ తనకు ఇష్టం లేకుండానే ఆ బనియన్ ను వేసుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె మీడియాకు తెలియజేసింది. నెట్టింట ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. నేను ఆ బనియన్‌ వేసుకోవాల్సి వస్తుందని ఎప్పుడు భావించలేదు.. ఇప్పటి వరకు నేను కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు అంటూ ఇప్పుడు సరదాగా ఆ విషయాన్ని చెప్పింది.

జాకీ ష్రాఫ్‌ ఆ పాటలో డ్రాయర్ పై మాత్రమే ఉంటాడు. ఇక ఊర్మిళ డ్రస్ కూడా చాలా తక్కువ ఉండాలి. కనుక అలా ప్లాన్‌ చేశారు. క్రియేటివిటీగా వర్మ అప్పట్లో దాన్ని చాలా ప్రత్యేకంగా చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఊర్మిళ లోని ఆ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. రహమాన్ ఆ పాటతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ పాటలు అన్ని కూడా ఆకట్టుకున్నాయి. అలా ఆ పాట వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఊర్మిళ వేసుకున్న బనియన్‌ పై కూడా ఇలా ఓ స్టోరీ దాగి ఉంది. బనియన్ ను హీరోయిన్‌ తో వేయించాలనే ఆలోచన నిజంగా చాలా స్పెషల్ గా ఉంది కదా.. ఆమె కూడా చాలా ప్రొఫెషనల్‌ గా ఆలోచించి ఇష్టం లేకున్నా కూడా ఒప్పుకుంది.
Tags:    

Similar News