కరోనా కారణంగా మన సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ బాగా డెబ్బతినింది. ఒకప్పుడు మిలియన్ డాలర్ల గురించి చెప్పుకున్న ఫిలిం మేకర్స్.. ఇప్పుడు యూఎస్ లో వేల లక్షల డాలర్లలో ఫిగర్స్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత 'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి సినిమాలు ఓవర్ సీస్ మార్కెట్ కు ఊపిరి పోశాయి.
ఈ క్రమంలో వచ్చిన 'అఖండ' సినిమా యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో లేటెస్టుగా వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్' అమెరికాలో అదే ఊపును కొనసాగిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే బాలయ్య 'అఖండ' కంటే.. బన్నీ సినిమాకు తక్కువగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి యూఎస్ఏ లో బాలకృష్ణ సినిమా కంటే 'పుష్ప' చిత్రం ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. రివ్యూస్ పరంగా కూడా చూసుకున్నా 'అఖండ' కు పాజిటివ్ గా రాలేదు. కానీ బన్నీ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ వసూళ్ళు చూస్తే 'పుష్ప' చిత్రం కంటే 'అఖండ' మూవీకే ఎక్కువ ఉన్నాయని కొందరు సినీ క్రిటిక్స్ అంటున్నారు. దీనిని బట్టి చూస్తే యూఎస్ జనాలు బన్నీ కంటే బాలయ్య వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
నిజానికి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ''అఖండ'' సినిమాకు రివ్యూస్ తో సంబంధం లేకుండా యూఎస్ లో ప్రేక్షకాదరణ దక్కింది. పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా.. మాస్ మూవీ కావడంతో ఎన్నారై నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా మిగతా వర్గాల ప్రేక్షకులు 'అఖండ' ను హిట్ చేశారనే టాక్ ఉంది. అందులోనూ అప్పుడు బాలయ్య సినిమాకు పోటీగా మరో మూవీ ఏదీ లేదు.
కానీ ఇప్పుడు అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమాకి అక్కడ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' నుంచి పోటీ ఉంది. హాలీవుడ్ సినిమా కారణంగానే బన్నీ సినిమాకు నార్త్ లో మరియు ఓవర్ సీస్ లో దెబ్బ పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో వారం వరకూ పెద్ద సినిమా విడుదల ఏదీ లేదు కాబట్టి.. ఈ వీకెండ్ లో 'పుష్ప: ది రైజ్' పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. మరి క్లోజింగ్ సమయానికి బన్నీ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫిగర్స్ నమోదు చేస్తుందో చూడాలి.