నారా రోహిత్ ఏంటి.. ఉయ్యాలవాడ వెళ్లడం ఏంటి.. అతనేమైనా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అతిథి పాత్ర ఏమైనా నటిస్తున్నాడా అని సందేహం కలుగుతోందా..? అలాంటిదేమీ లేదులెండి. రోహిత్ ఇప్పటికే పూర్తి చేసిన సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇది. ఈ నెల 24న రోహిత్ ‘బాలకృష్ణుడు’ సినిమాతో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.
ఈ సినిమాలో ఉయ్యాలవాడ ఊరి రెఫరెన్స్ ఉంది. ట్రైలర్ చూస్తే ఆ విషయం గమనిస్తుంది. ఒక చోట రోహిత్-రెజీనా కార్లో వెళ్తుంటే పక్కన ‘ఉయ్యాలవాడ 1 కి.మీ’ అన్న ఇండికేషన్ కనిపిస్తుంది. దీన్ని బట్టి సినిమాలో ఉయ్యాలవాడకు ప్రాధాన్యం ఉందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి సినిమాలో ఉయ్యాలవాడ ప్రస్తావన ఇంకెంత మేర ఉంటుందో చూడాలి.
తెలుగులో చాన్నాళ్ల తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది. రోహిత్ నటించిన పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా కూడా ఇదే కావడం విశేషం. కొత్త దర్శకుడు పవన్ మల్లెల ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. రోహిత్-పృథ్వీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటాయట. రోహిత్-రెజీనా కలిసి నటించిన మూడో సినిమా ఇది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.