ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని- సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'V'. నివేద థామస్.. అదితి రావ్ హైదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చిత్రబృందం తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది.
"ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలాంటోడు రూల్స్ కొద్దిగా బ్రేక్ చేస్తుంటాడు అంతే" అంటూ ఈతరం నేరస్తులకు తగ్గట్టుగా స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు తన ఇంట్రో ఇచ్చుకుంటాడు. సుధీర్ బాబు ఇంట్రో ఇలా ఉంటే నాని ఇంట్రో వయొలెంట్ గా ఉంది. ఎవరినో కట్టేసి కత్తితో క్రూరంగా చేతిపై ఒకరు కోస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఒక శవం కనిపిస్తుంది. దీనికి నేపథ్యంలో "నో ఎవిడెన్స్ సర్. సూపర్ క్లీన్ జాబ్. చాలా హై ఎండ్ కిల్లర్ సర్" అని ఒకరు చెప్పగానే సుధీర్ బాబు "ఎలా ఉంటాడు ఆ మనిషి?" అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు నాని ఒక చిటికేస్తూ ఉంటే ఒక వెహికల్ బ్లాస్ట్ అవుతుండగా ఎంట్రీ ఇస్తాడు. నానితో మాట్లాడుతూ నివేద థామస్ "యూ ఆర్ ఎ సైకో.. యూ నో దట్?" అంటుంది.
టీజర్ చూస్తుంటే ఇది ఒక పోలీసు-క్రిమినల్ కు మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ పాత్ర ఒకే కానీ నెగెటివ్ రోల్ నానికి ఎందుకో సూట్ కాలేదనిపిస్తోంది. క్రూరత్వంతో కూడా నాని ఎమోషన్స్ సహజంగా కంటే ఫోర్స్డ్ గా కనిపిస్తున్నాయి. నాని సహజ నటుడే కానీ ఈ విలనీతో ఎంతమాత్రం ప్రేక్షకులను మెప్పించగలడో వేచి చూడాలి. ఆలస్యం ఎందుకు.. టీజర్ చూసేయండి.
Full View