నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `ఆహా కళ్యాణం` మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది వాణీ కపూర్. అయితే తెలుగులో నటించిన తొలి చిత్రమే ఫ్లాప్ కావడంతో మళ్లీ ఇక్కడ కనిపించలేదు. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బేఫికర్.. వార్ చిత్రాల్లో నటించింది. ఆ రెండూ తనకు చక్కని గుర్తింపును తెచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి `బెల్ బాటమ్`తో పాటు మరో చిత్రంలో నటిస్తోంది.
జాతీయ అవార్డు గ్రహీత విలక్షణ చిత్రాల హీరో ఆయుష్మాన్ ఖురానా `చండీగర్ కరే ఆషికి` అనే పేరుతో రూపొందుతున్నచిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో క్రేజీ యంగ్ హీరో ఆయుష్మాన్ కు జోడీగా కనిపించబోతోంది. అయితే వాణీకపూర్ ఈ మూవీలో రెగ్యులర్ హీరోయిన్‌గా కనిపించడం లేదు. ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతోంది.
ట్రాన్స్ జెండర్ గా వాణీ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలుస్తోంది. సవాలుతో కూడుకున్న పాత్ర కావడం వల్లే వాణీ ఈ పాత్రని అంగీకరించిందని చెబుతున్నారు. లింగ మార్పిడి చేయించుకున్న ట్రాన్స్ జెండర్ గా వాణీ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఈ సినిమా తరువాత వాణీ కెరీర్ మలుపు తిరగడం ఖాయం అని చెబుతున్నారు.