ఫోటో స్టోరి: ఏదో తేడా కొడుతోంద‌మ్మా!

Update: 2020-02-17 02:30 GMT
కొంద‌రిని ఎంత అందంగా చూపించినా అంత బాగా సెట్ట‌వ్వ‌దు. ఆర‌డుగుల ఎత్తు.. డిజైన‌ర్ లుక్ సెట్ చేసినా కానీ ఇంకా ఏదో లోపం వెక్కిరిస్తుంటుంది. ఆ కోవ‌కే చెందుతుంది ఈ భామ‌. ఆహా క‌ల్యాణం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన వాణీకి ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి ఇదో కోణం.

ఇక‌పోతే ఈ అమ్మ‌డు ఇటీవ‌లే వార్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించేస్తోంది. ఆ క్ర‌మంలోనే త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు నిరంత‌రాయంగా రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. వీటిలో కొన్ని ఫోటోలు మాత్రం మిస్ ఫైర్ అవుతున్నాయ‌నే చెప్పాలి.

ఇదిగో అలాంటిదే ఈ ఫోటో. ఒక్కోసారి ఫ్యాష‌న్ విక‌టిస్తే ప‌రిణామం ఎలా ఉంటుందో ఇది చెప్ప‌క‌నే చెబుతోంది. వాణీ వోణీ ఏదో తేడా కొట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. సైడ్ యాంగిల్ లో అందాల్ని ఆరంగా చూపించాల‌ని అనుకుంటే అది కాస్తా తేడాగా క‌నిపిస్తోంది. ఉల్లిపొర డిజైన‌ర్ చీర‌లో వాణీ స్లిమ్ లుక్ హైలైట్ అయినా.. త‌న‌లో ఏదో మిస్స‌య్యింది! అన్న ఫీల్ క‌లుగుతోంది. అయినా ట్యాలెంట్ చూపించాల్సింది ఇలా కాదు.. పెద్ద తెర‌పై క‌త్రిన  క‌రీనా రేంజులోనో లేదా శ్ర‌ద్ధా క‌పూర్ .. ఆలియాలానో చెల‌రేగితేనే ప‌ట్టు చిక్కుతుంది. కానీ అందులో చూపించ‌కుండా ఇంకెందులోనే రెచ్చిపోయినా ఏం ఉప‌యోగం అంటూ పెద‌వి విరిచేస్తున్నారు.


Tags:    

Similar News