ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన వాణీ కపూర్ బాలీవుడ్ లో దశాబ్ధం పైగానే కెరీర్ పరంగా స్ట్రగుల్ ఎదుర్కొంది. ఇండస్ట్రీలో టాప్ మోడల్ గా రాణించిన ఈ బ్యూటీ యష్ రాజ్ బ్యానర్ అండదండలున్నా ఎందుకనో కత్రిన.. కరీనా రేంజు నాయిక కాలేకపోయింది.
అయితే ఇటీవల వార్ లాంటి బ్లాక్ బస్టర్ తో వాణీ పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ సినిమాలో యోగా గురూ పాత్రలో నటించిన వాణీ రోల్ మధ్యలో హత్యకు గురవుతుంది. అది ఆ పాత్రపై ఎంతో సింపథీని క్రియేట్ చేస్తుంది. త్యాగం చేసే ఒక బిడ్డ తల్లిగా వాణీ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం వాణీ ఇండస్ట్రీ బెస్ట్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.షంషేరా .. బెల్ బాటమ్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఛండీఘర్ కరే ఆషికీ అనే ప్రేమకథా చిత్రంలోనూ ఈ అమ్మడు నాయికగా నటిస్తోంది.
మరోవైపు వరుసగా మ్యాగజైన్ ఫోటోషూట్లతోనూ మెరుపులు మెరిపిస్తోంది వాణీ. తాజాగా వాణీ ఆన్ లొకేషన్ మేకప్ రూమ్ ప్రిపరేషన్ కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది. `మై ఫేవరెట్ ఎంటర్ టైనర్స్.. బిహైండ్ ది సీన్స్!`` అంటూ తన మేకప్ మేన్ బృందాన్ని పరిచయం చేసింది. వాణీ ప్రస్తుతం ఆన్ లొకేషన్ బిజీగా ఉన్నానని చెప్పకనే చెప్పిందిలా.