ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వాణీ కపూర్ ఆ సినిమా పరాజయంతో ఇక్కడ మరోసారి కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలింస్ ఆస్థాన నాయికగా వరుసగా భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. వాణీ కపూర్ నటించిన వార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కండల హీరో హృతిక్ రోషన్ తో వాణీ రొమాన్స్ అభిమానుల్లో చర్చకు వచ్చింది.
ప్రస్తుతం యష్ రాజ్ బ్యానర్ లోనే పలు క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసిన వాణీకి వాణిజ్య ప్రకటనల పరంగానూ భారీ క్రేజు నెలకొంది. ఇటీవలే ఓ విదేశీ వస్త్ర శ్రేణి బ్రాండ్ తో భారీ కాంట్రాక్ట్ కి సంతకం చేసింది. ఇకపోతే వాణీని సోషల్ మీడియాల్లో అనుసరించేవారు లక్షల్లో ఉన్నారు.
అందుకే నిరంతరం ఈ వేదికపై వేడెక్కించే ఫోటోషూట్లతో హీట్ పెంచేస్తోంది వాణీ. తన ఫాలోవర్స్ ని సుస్థిరం చేసుకుని భారీగా ఆర్జించేందుకు వాణీ నిరంతరం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో టచ్ లో ఉంటోంది. ఇటీవల బికినీ బీచ్ విహారానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసిన వాణీ తాజాగా మరో హాట్ ఫోటో షూట్ ని షేర్ చేసింది. సిల్వర్ కలర్ మెటాలిక్ డిజైనర్ వేర్ లో వాణీ లేటెస్ట్ ఫోటోషూట్ అమాంతం వేడి పెంచేసింది. మత్తు కళ్లతో వలలు వేస్తూనే టోన్డ్ బాడీని ఆవిష్కరించింది వాణీ. హిస్టారికల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ షంషేరా .. కమర్షియల్ థ్రిల్లర్ బెల్ బాటమ్ లాంటి భారీ చిత్రాల్లో వాణీ నటిస్తోంది. అలాగే `ఛండీఘర్ కరే ఆషికీ` అనే ప్రేమకథా చిత్రంలోనూ ఈ అమ్మడు నాయికగా నటిస్తోంది.