ఏట వాలు చూపుల‌తో జిల్ల‌నిపించిన వాణీ

Update: 2021-12-28 01:30 GMT
వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించింది వాణీ క‌పూర్. అంత‌కుముందు కెరీర్ తో పోలిస్తే వార్ త‌న‌కి మేలిమిమలుపు అని చెప్పాలి. ఆ త‌ర్వాత వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా ఆఫ‌ర్ల‌తో వాణీ మ‌రింత బిజీ అయిపోయింది.

ఇప్పుడు వాణీ కపూర్ కి ప్ర‌భాస్ సలార్ లో కీల‌క పాత్రను ఆఫ‌ర్ చేసారు ప్ర‌శాంత్ నీల్. విల‌న్ కు జ‌త‌గా వాణీక‌పూర్ న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక వాణీ ఒడ్డు పొడుగు కిక్కెక్కించే అంద‌చందాలు స‌లార్ కి ప్ల‌స్ కానున్నాయ‌ని అంతా భావిస్తున్నారు. ఈ క్రిస్మ‌స్ ని పురస్క‌రించుకుని వాణీ ఇదిగో ఇలా చిలౌట్ మూవ్ మెంట్ ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. త‌న ఒంటిపై స్టార్స్ మెరుపులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. వాణీ అలా స్మైలిస్తూ జిల్ల‌నిపిస్తోంది. ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేస్తూ ఏటవాలు చూపుల‌తో జిల్ల‌నిపిస్తున్న వాణీ అంటూ పొగిడేస్తోంది యూత్.

వాణీ కపూర్ బాలీవుడ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించ‌నంత‌గా  రాణించ‌లేదు.  ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్  పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు. అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో  `చండీఘ‌ర్ క‌రే ఆషికిల్` లో న‌టిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నాడు.
Tags:    

Similar News