వేడెక్కించే ఫోటోషూట్ల‌లో తగ్గేదేలే..!

Update: 2022-12-22 03:51 GMT
ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థాన క‌థానాయిక‌గా వాణీ క‌పూర్ ఓ వెలుగు వెలుగుతోంది. చాలా అరుదుగా హిట్లు వ‌రుస ఫ్లాపుల‌తో ప‌త‌న‌మైన ఈ బ్యూటీకి వైఆర్ ఎఫ్ నిర్మించిన వార్ చిత్రంతో బిగ్ బూస్ట్ అందింది. అటుపై వాణీ హ‌వాకు ఎదురే లేదు. ఇటీవ‌ల అగ్ర‌హీరోల స‌ర‌స‌న‌ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ వాణీ స‌త్తా చాటుతోంది. ఆదిత్య చోప్రా కాంపౌండ్ లో భారీ ప్యాకేజీ డీల్స్ కి లాక్ అవుతున్న వాణీ మ‌రోవైపు భారీ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోను న‌టిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది.

టాప్ మోడ‌ల్ కం న‌టి వాణీ క‌పూర్ మ‌రోవైపు ఇన్ స్టాలో చెల‌రేగి ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఈ వేదిక‌పై ఇప్ప‌టికే అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని సంపాదించింది. తాజాగా వాణీ ఓ డిజైన‌ర్ లుక్ ని షేర్ చేయ‌గా అది ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. బ్లాక్ డిజైన‌ర్ షార్ట్ ఫ్రాక్ లో త‌న పొడుగు కాళ్ల అందాన్ని ఎలివేట్ చేస్తున్న వాణీ హైహీల్ ని స‌ర్ధుకుంటూ ఫోజిచ్చింది. వాణీ కిల్ల‌ర్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ చెల‌రేగి కామెంట్లు చేస్తున్నారు. ఇన్ స్టాలో ఈ ఫోటో ప్ర‌త్య‌క్షం కాగానే ఒక అభిమాని ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. అమేజింగ్ పిక్చ‌ర్.. కీప్ కిల్లింగ్ ఇట్ గాళ్! అంటూ పొగిడేశాడు.

అస‌లు వాణీ ప్ర‌స్థానం ఎలా మొద‌లైంది? అన్న వివ‌రంలోకి వెళితే.. తొమ్మిదేళ్ల క్రితం ఆదిత్య చోప్రా 'శుద్ధ్ దేశీ రొమాన్స్‌'తో మోడ‌ల్ వాణీ క‌పూర్ ని గ్రాండ్‌ లాంచ్ చేశాడు. ఆరంభ‌ సినిమా బాగానే ఆడింది కానీ వాణీకి న‌టిగా అది పెద్దగా క‌లిసిరాలేదు. అప్పటి నుండి ఈ బ్యూటీ YRF కాంపౌండ్ లో స్థిర‌మైన‌ హీరోయిన్. బ్యాండ్ బాజా బారాత్  తెలుగు వెర్ష‌న్ 'ఆహా కళ్యాణం'లో న‌టించినా ఆశించిన విజ‌యాన్ని ఇవ్వ‌లేదు.

తమిళ వెర్షన్ కూడా ఫ్లాపైంది. అటుపై  ఆదిత్య స్వయంగా దర్శకత్వం వహించిన బాక్సాఫీస్ డిజాస్ట‌ర్ 'బేఫిక్రే'లో కూడా వాణీ న‌టించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదలు.. రణవీర్ సింగ్ - హృతిక్ రోషన్ (వార్)- రణబీర్ కపూర్ (శంషేరా) వరకు ఆదిత్యచోప్రా వ‌రుస చిత్రాల్లో వాణీకి అవ‌కాశాలు క‌ల్పించాడు. అక్షయ్ కుమార్ -బెల్ బాటమ్... ఆయుష్మాన్ ఖురానా -చండీగఢ్ కరే ఆషికి లోను వాణీ న‌టించింది. ఇవి రెండూ వాణిజ్యపరమైన వైఫల్యాలను ఎదుర్కొన్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ షోలుగా నిలిచాయి.

ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత ఆదిత్య చోప్రా ఇప్ప‌టికీ వాణీలో ఏం చూసి అవ‌కాశాలిస్తున్నారు? అన్న విమ‌ర్శ కూడా ఉంది. కెరీర్ లో వార్ ఘ‌న‌విజ‌యం త‌ప్ప ఇంకేదీ లేదు. కానీ త‌న‌కి వ‌రుస అవ‌కాశాలిస్తున్నాడు. ఇంత‌కీ ఆదిత్య చోప్రా వాణీలో ఏం చూస్తాడు? అన్న చ‌ర్చ ఇటీవ‌ల వేడెక్కిస్తోంది.

ఐశ్వర్య రాయ్-మాధురీ దీక్షిత్ రేంజులో స్టన్నర్ అయితే కానే కాదు. కానీ అవ‌కాశాలొస్తున్నాయి. కాజోల్ లేదా అలియాలా గొప్ప ట్యాలెంటెడ్ న‌టి కూడా కాదు. అయినా ఛాన్సులొస్తున్నాయి. అయితే వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త క్ర‌మశిక్ష‌ణ‌తో వాణీ ఇలాంటి అవ‌కాశాలు అందుకుంటోంద‌ని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News