మీరా చోప్రా ఎపిసోడ్ లానే అస‌భ్యంగా తిట్టారు కానీ..!

Update: 2020-06-04 05:30 GMT
సోష‌ల్ మీడియా పైత్యం ప‌రాకాష్ట‌కు చేరుకుంది ఇప్ప‌టికే. అక్క‌డ సెల‌బ్రిటీల్ని తూల‌నాడ‌డం.. అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో బూతులు తిట్ట‌డం చూస్తున్న‌దే. ఇప్ప‌టికే క‌థానాయిక‌ మీరా చోప్రాపై ఎన్టీఆర్ అభిమానుల వీరంగంపై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి విధిత‌మే. ఇక ఇదే త‌ర‌హాలో ప్ర‌తిసారీ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో రెచ్చిపోతుంటే సెల‌బ్రిటీలు స‌హ‌నం కోల్పోవాల్సి వ‌స్తోంది.

ఇత‌రుల మాటేమో కానీ.. బాలీవుడ్ అందాల క‌థానాయిక.. `వార్` బ్యూటీ వాణీ క‌పూర్ ఇలాంటి సంద‌ర్భంలో స్పందించిన తీరు నెటిజ‌నుల మ‌న్న‌న‌లు అందుకుంటోంది. తాజాగా ఇన్ స్టా లైవ్ చాట్ లో త‌న అందం గురించి శ‌రీరాకృతి గురించి ఓ నెటిజ‌నుడు ఇష్టానుసారం అన‌కూడ‌ని మాట‌లు అనేశాడు. అయితే దానికి వాణీ ఏమాత్రం నొచ్చుకోలేదు స‌రిక‌దా.. స‌హ‌నం కోల్పోకుండా ఎంతో విన‌మ్రంగా అత‌డికి కౌంట‌ర్ వేసింది. ఇంత‌కీ వాణీ ఏమంది? అంటే..

``మీకు హృదయం ఉంది. కొంచెం అయినా మనసుతో ఆలోచించండి. అనవసరంగా ఎదుటి వారిని ద్వేషించొద్దు!!`` అంటూ అటువైపు వ్య‌క్తి ద్వేషాన్ని హైలైట్ చేస్తూ చీవాట్లు పెట్టింది. వాణి లోని స‌హ‌నం మెప్పు పొందింది ఈ ఎపిసోడ్ లో. ఇక మీరా చోప్రా ఎపిసోడ్ లోనూ ఇలాంటి అస‌భ్య ప‌ద‌జాలం మ‌రింత పెచ్చురిల్ల‌డంతో సైబ‌ర్ పోలీస్ కి ఫిర్యాదు చేసే వర‌కూ వెళ్లింది.

అయితే స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఒక్కొక్క‌రూ ఒక్కోలా స్పందిస్తార‌న‌డానికి ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హార‌మే ఎగ్జాంపుల్. అయిన‌దానికి కాని దానికి కొంద‌రు సీరియ‌స్ గా స్పందిస్తే .. మ‌రికొంద‌రు మాత్రం ర‌చ్చ చేయ‌కుండానే తెలివిగా గ‌డ్డి పెట్టేస్తుంటారు. ఈ విష‌యంలో వాణీ ది బెస్ట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజ‌నం.
Tags:    

Similar News