స‌న్న జాజి తీగ సొగ‌సుతో సంపేత్తోందిగా

Update: 2022-02-02 04:30 GMT
స‌న్న జాజి తీగ సొగ‌సుతో సంపేత్తోంది!.. ఎవరీ బ్యూటీ?.. అంటే.. అంత‌గా ప‌రిచయం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు ఇది. ది గ్రేట్ వాణీ క‌పూర్. య‌ష్ రాజ్ ఫిలింస్ ఆస్థాన నాయిక‌. చోప్రాలు త‌మ ఫ్రాంఛైజీ నాయిక‌గా వాణీని ఫిక్స్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వైఆర్ఎఫ్ సంస్థ నిర్మించిన‌ శుధ్ దేశీ రొమాన్స్.. ఆహా కల్యాణం.. వార్ స‌హా ఎన్నో సినిమాల్లో వాణీ న‌టించింది.

ఇక నిరంత‌రం ఇన్ స్టాలో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. ల‌క్ష‌ల్లో క్లిక్ లు లైక్ లతో ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం ఆర్జిస్తోంది వాణీ. ప్ర‌ముఖ బ్రాండ్ల‌న్నీ వాణీ వెంట క్యూ క‌డుతున్నాయి. వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో వాణీ ఫేట్ అమాంతం మారిపోయింది.

తాజాగా మ‌రోసారి క‌ళాత్మ‌క ఫోటోషూట్ తో విరుచుకుప‌డింది. ఈ ఫోటోషూట్ లో వాణీ ఇన్న‌ర్ అందాల ఎలివేష‌న్ మ‌తులు చెడ‌గొడుతోంది. ఇదిగో ఇలా అందాల సిరుల్ని ఆరబోస్తూ అంటీ ముట్ట‌ని టూపీస్ ని ధ‌రించి మైండ్ బ్లాక్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక వాణీ క‌పూర్ అంత‌కంత‌కు బ‌క్క చిక్కుతూ మ‌రీ సైజ్ జీరోకి షిఫ్ట‌యిపోతుంటే అభిమానులు షాక్ తింటున్నారు. అయితే ఈ స‌రికొత్త రూపంతో క‌ళాత్మ‌క ఫోటోషూట్ల‌తోనే అమ్మ‌డు మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఒక్కో క‌మిట్ మెంట్ కి 3-4 కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకుంటోంది. అలాగే బ్రాండ్ల కోసం కోట్లాది రూపాయ‌ల డీల్ ని సెట్ చేసుకుంటోంది.

వాణీ కపూర్ బాలీవుడ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించ‌నంత‌గా  రాణించ‌లేదు.  అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో  `చండీఘ‌ర్ క‌రే ఆషిఖ్` ఇటీవ‌ల విడుద‌ల కాగా ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించాడు. సినిమాకి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. జిమ్ లో అందాలు విర‌జిమ్మే జుంబా గాళ్ గా వాణీ అద‌ర‌గొట్టింద‌న్న టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్  పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు.


Full View
Tags:    

Similar News