సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ అధికారికంగా ప్రారంభమైపోయింది. సహజంగా సుకుమార్ సినిమాల పిక్చరైజేషన్ నెమ్మదిగా జరుగుతుంది. కానీ రామ్ చరణ్ మూవీ విషయంలో పక్కా ప్లానింగ్ తో సాగుతున్నారట. మొదట తూర్పు గోదావరి జిల్లాలో షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ అక్కడ మెగా ఫ్యాన్స్ హంగామాను తట్టుకోవడం కష్టమని భావించి.. ఇప్పుడు పొలాచ్చికి షూటింగ్ షిఫ్ట్ చేశారు.
మార్చ్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభించి.. ఓ నెల రోజులు కంటిన్యూగా షూటింగ్ చేయనున్నారట. మొత్తం మూడే షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు ఈ సినిమాలో విలన్ పాత్రను జగపతి బాబు చేస్తాడని అంటున్నా.. ఇంకా అగ్రిమెంట్ పూర్తి కాలేదట. అందుకే ఈ పాత్ర కోసం సురేష్ చంద్ర మీనన్ తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ బ్రదర్ కేరక్టర్ కోసం ఆది పినిశెట్టిని అనుకుంటున్న సంగతి తెలిసిందే.
ఒకవేళ ఆది పినిశెట్టి ఈ పాత్రను చేయకపోతే.. షూటింగ్ ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఉండేందుకు గాను.. వైభవ్ ను ఎంపిక చేసుకున్నారట. ప్రతీ దానికి ముందుగానే ఆల్టర్నేటివ్స్ సెట్ చేసుకున్న విధానం చూస్తే.. ఈ తరహా ప్లానింగ్ తో సుకుమార్ శరవేగంగానే సినిమా తీసేసేట్లుగా ఉన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/