పిడుగు లాంటి ట్వీట్స్ పెట్టిన చిన్మ‌యి

Update: 2018-10-10 06:44 GMT
నా అకౌంట్ హ్యాక్ గురి కాలేదు. నా మాన‌సిక ప‌రిస్థితి బాగానే ఉంది. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను షేర్ చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మ‌ని న‌మ్ముతాను. వాటికి క‌ట్టుబ‌డి ఉంటాను.. ఇలాంటి డిస్ క్లేమ‌ర్స్ ను పెట్టి మ‌రీ త‌న టిట్ట‌ర్ ఖాతాలో ట్వీట్స్ చేసిన సింగ‌ర్ క‌మ్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు.

మీ టూ ఉద్య‌మంలో భాగంగా ఇప్ప‌టికే త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి.. త‌న చిన్న‌త‌నంలోనూ.. యుక్త‌వ‌య‌సులోనూ.. సింగ‌ర్ గానూ ఎదురైన చేదు అనుభ‌వాల్ని ఇప్ప‌టికే చెప్పి సంచ‌ల‌నం సృష్టించిన చిన్మ‌యి తాజాగా కొంద‌రు బాధితులు త‌న‌కు షేర్ చేసిన త‌న అనుభ‌వాల్ని తాజాగా వెల్ల‌డించింది.

అయితే.. ఈ బాధితులంతా ప్ర‌ముఖ త‌మిళ క‌వి.. ర‌చ‌యిత‌గా పేరున్న వైరముత్తు మీద కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న గురించి ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా చెడుగా మాట్లాడ‌ని ప‌రిస్థితి. కొంద‌రైతే ఆయ‌న్ను నికార్సైన వ‌జ్రంగా అభివ‌ర్ణిస్తుంటారు. అలాంటి ఆయ‌న‌.. కొంద‌రు సింగ‌ర్స్ ద‌గ్గ‌ర త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించిన వైనం చిన్మ‌యి దృష్టికి రాగా.. ఆమె వాటిని ప్ర‌పంచానికి చెప్పేసింది.

అయితే.. వైర‌ముత్తును దెబ్బ తీయ‌టం కోస‌మే ఇదంతా చేస్తున్న‌ట్లు చెప్పినా.. చిన్మ‌యి లాంటి సింగ‌ర్‌ కు ఇలాంటి సంచ‌ల‌నాల అవ‌స‌ర‌మే లేదు. త‌న దృష్టికి కొంద‌రు తెచ్చిన అంశాల్ని ప్ర‌పంచానికి తెలియ‌చేసే బాధ్య‌త‌ను తీసుకున్న‌ట్లుగా చెప్పాలి. ఆమెకు కొంద‌రు సింగ‌ర్స్ పంపిన ట్వీట్స్ ను ఆమె తాజాగా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌పెట్టింది. ఆవేమిటో చూస్తే..

+ నాకు తెలిసిన ఓ సింగర్‌ కి ఎదురైన అనుభవం ఇది. తనని వైరముత్తుకు పరిచయం చేసినప్పుడు మాట్లాడటానికి నిర్మాతను - తనను ఓ హోటల్‌ లో కలవమన్నారు. ఆ తర్వాత నీకు పాడే అవకాశం కావాలంటే ఒక రాత్రి గడపాలన్నారు. వెంటనే తను ఏడుపందుకుంది. తను గోల్డ్‌ మెడలిస్ట్‌. ఆ సంఘటనతో సినిమాలో పాడనని ఒట్టు పెట్టుకుంది.

+ నాకు 18 ఏళ్లు. ఓ ప్రాజెక్ట్‌ పని మీద వైరముత్తుతో కలసి పని చేయాల్సి వచ్చింది. ఆయన గొప్ప కవి - లెజెండ్‌ అని నాకు విపరీతమైన అభిమానం ఉండేది. ఓసారి పాటలోని లైన్‌ ని వివరిస్తూ సడన్‌ గా వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. ఓకే సార్‌ అంటూ అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పటి నుంచి ఒక్కదాన్నే ఉండటానికి భయపడేదాన్ని. ఆ ప్రాజెక్ట్‌ అయిపోయేంత వరకూ నలుగురితో పాటే ఉండేదాన్ని.

+  నా కోసం బటర్‌ మిల్క్‌ ఆర్డర్‌ చేశాడు. అది తాగుతున్నప్పుడు నీ పెదాలకేదో అంటుకుంది అంటూ, మెల్లిగా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దుపెట్టుకోబోయాడు. వెంటనే నా ఫోన్‌ పట్టుకుని పరిగెత్తాను. నా ఫ్రెండ్స్‌ కు - కొందరు సింగర్స్‌ కు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ విషయం ఇంకా మా ఆయనకు తెలియదు. ఒకవేళ ఆయనకు తెలిస్తే నా కెరీర్‌ ను సాగనివ్వరేమో.

+ నా వర్క్‌ ని అభినందించడానికి తన ఆఫీస్‌ కి పిలిచారు. ఆయన్ను నా తాతగారిలా భావించాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం అలాంటిది. అయితే ఆయన నా పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తిస్తాడని ఊహించలేదు. నేను గదిలోకి వెళ్లగానే తలుపు వేసి నన్ను తాకబోయాడు. నేను అక్కణ్ణుంచి పరిగెత్తుకు వెళ్లిపోయాను. ఆ తర్వాత నాకు ఫోన్‌ చేసి, తన భార్యకు చెప్పొద్దు అన్నాడు.


Tags:    

Similar News