డాన్స్ లో చరణ్ తరువాతే ఎవరైనా: వైష్ణవ్ తేజ్

Update: 2022-08-30 09:45 GMT
వైష్ణవ్ తేజ్ తాజాగా చిత్రంగా రూపొందిన 'రంగ రంగ వైభవంగా' సినిమా, సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వైష్ణవ్ జోడీగా కేతిక శర్మ అలరించనుంది. హీరో  .. హీరోయిన్ ఇద్దరూ కూడా తమ కెరియర్లో చేస్తున్న ఫస్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. తాజాగా 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న వైష్ణవ్ మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

అలీ ప్రశ్నలకు వైష్ణవ్ స్పందిస్తూ .. "నా సినిమాలకి సంబంధించిన కథల విషయంలో నేనే నిర్ణయాలు తీసుకుంటాను. 'ఉప్పెన' కథ ఒక్కటి మాత్రమే చిరంజీవిగారు విన్నారు.

ఫస్టు సినిమా కథను చిరంజీవిగారి అంగీకారంతో చేయాలని నేను అనుకోవడం వలన ఆయన కథ విన్నారు అంతే. ఇక ఆ తరువాత నుంచి  నా సినిమాల కథలను నేనే వింటూ వస్తున్నాను. కథ నచ్చినా .. నచ్చకపోయినా చెప్పేది నేనే. ఇక వేరేవారెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోరు. నాకు నచ్చిన కథలతోనే నేను ముందుకు వెళుతున్నాను.

 చిరంజీవిగారికి సినిమాల్లో 'ఖైదీ' .. 'బావగారూ బాగున్నారా' .. 'శంకర్ దాదా' .. 'స్టాలిన్' .. 'ఇంద్ర' .. 'ఠాగూర్' చాలా ఇష్టం. పవన్ మామయ్య సినిమాల్లో 'తమ్ముడు ' .. 'బద్రి' .. 'ఖుషి' సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాలన్నీ కూడా నేను కల్యాణ్ మావయ్య ఇంట్లోనే చూశాను.

చెబితే నమ్మరు 'తమ్ముడు' సినిమా ఓ 120 సార్లు చూశాను. ఆ సినిమాలో నాకు సీన్ బై సీన్ .. డైలాగ్ బై డైలాగ్ గుర్తుంది. డాన్స్ విషయానికి వస్తే చరణ్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. డాన్స్ విషయంలో నేను ఇంకా ప్రాక్టీస్ చేయవలసింది చాలా ఉంది. బాగా ప్రాక్టీస్ చేస్తే  కెమెరా ముందు ఓ మాదిరిగా చేస్తానేమో.

చరణ్ చేసిన సినిమాల్లో 'ఆర్ ఆర్ ఆర్' న.. 'మగధీర' సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్య చేసిన సినిమాల్లో 'సుప్రీమ్' .. 'సోలో బ్రతుకు సో బెటర్' .. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలు నాకు నచ్చుతాయి. బన్నీ సినిమాల్లో 'హ్యాపీ' .. 'ఆర్య' .. 'పుష్ప' సినిమాలను ఇష్టపడతాను. భవిష్యత్తులో ఒకేవేళ అన్నయ్యతో కలిసి సినిమా చేయవలసి వస్తే, యాక్షన్ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. మా ఇద్దరికీ యాక్షన్ ఎక్కువగా సెట్ అవుతుందని భావిస్తాను" అంటూ చెప్పొచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News