'వ‌కీల్ సాబ్' నిర్మాత‌ నే దివాళా తీయించిందా?

Update: 2020-04-13 02:30 GMT
స్టార్ కాస్టింగ్..భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన చిత్రాలు బ్లాక్ బ‌స్ల‌ర్  అయింతే ఎంత సంతోషమో.. ప‌రాజ‌యం పాలైతే అంత‌కు మించిన‌ మ‌నో వేద‌న ఎదుర్కోవాలి. అగ్ర న‌టులు..కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డి...బోలెడంత స‌మ‌యం  ఇలా అంతా బూడిద‌లో పోసిన పన్నీరే అవుతుంది. సంతోషాన్నిచ్చే సంఘ‌ట‌న క‌న్నా... ఒక చేదు ఘ‌ట‌న మాన‌సికంగా ఎంతో కుంగ‌దీస్తుంది అనడానికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. అలాంటి స‌న్నివేశాన్ని ఎదుర్కొన్నారు ఓ అగ్ర నిర్మాత‌. అతిలోక సుంద‌రి  శ్రీదేవి-బోనీ క‌పూర్ జీవితంలో క‌ల్లోలానికి కార‌ణ‌మైన ఆ సినిమా ఏదీ? అంటే...

1993లో రిలీజ్ అయిన `రూప్ కి రాణీ చోరాన్ కా రాజా` చిత్రం అప్ప‌ట్లో ఓ పెనుకంప‌న‌మే అయ్యింది.  శ్రీదేవి- అనీల్ క‌పూర్- అనుప‌మ్ ఖేర్- ప‌రేష్ రావ‌ల్-  జాకీష్రాప్ - రామ్ సేథీ వంటి పెద్ద తారాగ‌ణంతో  భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కి రిలీజ్ అయింది. స‌తీష్ కౌషిక్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్ దాదాపు 10 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. రాజీ లేని నిర్మాణం...పెద్ద స్టార్లు న‌టించిన చిత్రం కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద భారీగానే వ‌సూళ్లు సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు సైతం అంచ‌నా వేసారు. స్టార్ క్యాస్టింగ్...ద‌ర్శ‌కుడిపై నమ్మ‌కంతోనే బోనీ ఆ సినిమాకు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌నీసం మేకింగ్  ఖ‌ర్చులు కూడా రాబ‌ట్టలేక‌పోయింది. కేవ‌లం 2.7 కోట్లు మాత్రమే రాబ‌ట్టింది. అప్ప‌టివ‌ర‌కూ బోనీ క‌పూర్ చేసిన సినిమాల‌న్నీ ఓ ఎత్త‌యితే.. ఆ ఒక్క‌టీ మ‌రో మ‌రో ఎత్తు అయ్యింది. క‌నీసం ఆర్టిస్టుకు పెండింగ్ బ‌కాయిలు చెల్లించ‌లేని ప‌రిస్థితి ఎదురైంది.

ఈ ప‌రాజ‌యం బోనీ క‌పూర్ ని ఒక్క‌సారిగి ఊబిలోకి నెట్టేసింది. ఉన్న డ‌బ్బంతా ఈ సినిమా ఖ‌ర్చు చేసేసారు. ఇంకా అద‌నంగా అప్పులు తెచ్చి మ‌రీ పెట్టారు. కానీ బాక్సాఫీస్ ఫ‌లితం అంతా తారుమారు చేసేసేంది. చివ‌రికి బోనీ క‌పూర్ దివాళా తీసేయాల్సిన స‌న్నివేశం ఎదురైంది. ఇలాంటి ఎన్నో అనుభ‌వాల‌ను రూప్ కి రాణీ చోరాన్ కా రాజా బోనీ-శ్రీదేవిల‌కు మిగిల్చింది. అప్ప‌టి నుంచి ఈ సినిమా గురించి త‌లుచుకోవాలంటే బోనీ అండ్ కోకి గుండెల్లో రైళ్లు ప‌రిగెడ‌తాయి. అతిలోక సుంద‌రి న‌టిగా అడుగు పెట్టి 25 పూర్త‌యిన సంద‌ర్భంగా  ఆ సినిమా యూనిట్ ఆ ట్రాజిక్ ఎక్స్ పీరియ‌న్స్ ని  ట్విట‌ర్ వేదిక‌గా గుర్తు చేసుకున్నారు.

ఆ చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీష్ ఏమ‌న్నాంటే? 25 ఏళ్ల‌ క్రితం ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఒక విప‌త్తుని సృష్టించింది. కానీ ఆ సినిమా నా హృద‌యానికి ద‌గ్గ‌రైన చిత్రమ‌ని అ‌న్నారు. ఇంకా అనీల్ క‌పూర్ మాట్లాడుతూ..ఈ సినిమా రిలీజ్ అయి 25 సంవ‌త్స‌రాలు గడిచిపోయిందంటే న‌మ్మ‌లేక‌పోతున్నాను .ఆ సినిమా స‌మ‌యంలో ఎదుర్కున్న ఇబ్బందుల‌న్నీ ఒక్కొక్క‌టిగా గుర్తున్నాయి. కానీ ఆ జ‌ర్నీ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది అని అన్నారు. మొత్తానికి  ఓ ప్లాప్ సినిమా గురించి ఇంత‌గా డిబేట్ పెట్ట‌డం అన్న‌ది బాలీవుడ్ వాళ్ల‌కే చెల్లింది సుమీ!  బోనీ ప్ర‌స్తుతం దిల్ రాజుతో క‌లిసి ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా వ‌కీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ పింక్ కి రీమేక్ ఇది.


Tags:    

Similar News