'వి' సినిమా తరహలోనే 'వకీల్ సాబ్‌'

Update: 2021-06-15 09:30 GMT
గత ఏడాది లాక్ డౌన్‌ కారణంగా దిల్‌ రాజు 'వి' సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. థియేటర్లు లేని సమయంలో వి ను ఓటీటీ ద్వారా విడుదల చేసిన దిల్‌ రాజు ఆ తర్వాత మళ్లీ లాక్ డౌన్ ఎత్తి వేసి థియేటర్లు పునః ప్రారంభించిన తర్వాత రీ రిలీజ్ చేశాడు. ఓటీటీ లో వచ్చిన తర్వాత 'వి' ను థియేటర్లలో చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. వారం పది రోజులు కొన్ని థియేటర్లలో నాని వి తో సందడి చేసి వెళ్లి పోయాడు. ఇప్పుడు వి తరహాలోనే వకీల్‌ సాబ్ ను రీ రిలీజ్ చేసేందుకు దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

వకీల్‌ సాబ్‌ సినిమా విడుదల అయిన వెంటనే సెకండ్‌ వేవ్‌ వల్ల థియేటర్లకు జనాలు రాలేదు... కరోనా భయం వల్ల వకీల్‌ సాబ్‌ మొదటి వారం రోజులు మినహా మళ్లీ ఎవరు చూసేందుకు ముందుకు రాలేదు. దాంతో సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. సినిమా ను ఓటీటీలో చాలా మందే చూశారు. అయినా కూడా మళ్లీ ఏకంగా 300 స్క్రిన్స్‌ లో ఈ సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వకీల్‌ సాబ్ సినిమా ను రీ రిలీజ్ చేసినా కూడా తప్పకుండా అభిమానులు ప్రేక్షకులు చూస్తారనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నాడట.

కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముకం పట్టింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మళ్లీ సాదారణ స్థితికి వస్తున్నాయి. దాంతో మళ్లీ సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం మొదలు అవ్వబోతుంది. ఈ  నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో థియేటర్ల తాళాలు ఓపెన్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మొదట 50 శాతం ఆక్యుపెన్సీతో ఓకే చెప్పే అవకాశం ఉంది. అయినా కూడా వకీల్‌ సాబ్‌ ను వెంటనే 300 స్క్రీన్స్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి దిల్ రాజు ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అయ్యేను చూడాలి.
Tags:    

Similar News