'వకీల్ సాబ్' నాన్ థియేట్రికల్ రైట్స్ అంత రేటు పలికాయా..?

Update: 2021-03-03 10:35 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వకీల్ సాబ్''. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్ కలసి నిర్మిస్తున్నారు. ఇది హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్. పవన్ ఇందులో లాయర్ గా కనిపిస్తుండగా.. శృతి హసన్ ఆయనకు జోడీగా నటించింది. నివేధా థామస్ - అంజలి - అనన్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా నాన్ థియేటర్స్ రైట్స్ గురించి సినీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

'వకీల్ సాబ్' సినిమా శాటిటైట్ రైట్స్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ' టీవీ వారు సొంతం చేసుకున్నారట. మొత్తం మీద డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కలుపుకొని 30 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మారని ప్రచారం జరుగుతోంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ మిగిలి ఉన్నప్పటికీ.. ఈ సినిమా ఆల్రెడీ హిందీ రీమేక్ కావడంతో ఏ రేటుకు అమ్ముడుపోతాయో చూడాలి. ఇకపోతే పవన్ చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న 'వకీల్ సాబ్' కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా భారీ వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది. థియేటర్స్ లో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతులు ఉండటం.. మంచి రిలీజ్ డేట్ కూడా దొరకడం 'వకీల్ సాబ్' కి కలిసొచ్చే అంశాలని చెప్పవచ్చు.




Tags:    

Similar News