టెంపర్ ను రివర్స్ లో మార్చేసిన వంశీ

Update: 2017-04-02 08:09 GMT

సూపర్ హిట్ నవలలను.. కాన్సెప్ట్ నచ్చిన నావెల్స్ ను సినిమాలుగా మలచే సంస్కృతి అన్ని సినీ ఇండస్ట్రీలలోను ఉంది. దీనికి హాలీవుడ్.. బాలీవుడ్.. టాలీవుడ్ లాంటి తేడాలేమీ ఉండవు. ఎన్నో నవలలు సినిమాలుగా రూపొంది సక్సెస్ లు సాధించాయి.. పరాజయం పాలైనవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ను రివర్స్ చేస్తున్నాడు రచయిత వక్కంతం వంశీ.

వంశీ కథా రచనలో.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ టెంపర్ భారీ సక్సెస్ ను సాధించింది. ఇప్పుడీ మూవీ కథను.. ఇంగ్లీష్ నవలగా మార్చాడు వక్కంతం. ఇప్పటికే చూసేసిన సినిమాను.. తెలిసిన కథను మళ్లీ నవలగా ఎందుకు చదవాలనే ఆలోచన ఉంటుందని తనకు తెలుసన్న వంశీ.. నవలకు సినిమాకు రచనలోనే చాలా తేడా ఉంటుందని చెప్పాడు. నవలల విషయంలో రచయితకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని.. హీరో పాత్ర దయ కేరక్టర్ లో మరిన్ని షేడ్స్ నవలలో ఉంటాయని చెప్పాడు. అంతే కాదు.. సినిమాకి ఎంతో కీలకంగా నిలిచిన క్లైమాక్స్ కూడా నవల్లో వేరేగా ఉంటుందని చెప్పడం ఆశ్చర్యకరం.

'భావం క్లియర్ గా ఉంటే భాష ప్రాబ్లెం అవదు. పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే లాంటి లైన్స్ ఇంగ్లీష్ లో రాయలేకపోవచ్చు. కానీ ఎసెన్స్ మాత్రం అదే ఉంటుంది' అన్న వక్కంతం వంశీ.. ప్రస్తుతం టెంపర్ మూవీని తమిళ్.. కన్నడ.. హిందీల్లో రీమేక్ చేస్తున్నారంటే.. ఇంకా ఆ సబ్జెక్ట్ ఎంత డిమాండ్ ఉందని చెప్పాడు. అందుకే మరింత మందికి తన కథను చేరువ చేసేందుకు టెంపర్ ను ఇంగ్లీష్ నవలగా మార్చానన్నాడు ఈ స్టార్ రైటర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News