అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా రిలీజ్ కి రెడీ అయిపోతోంది. ఈ చిత్రానికి రెండు గ్రాండ్ ఈవెంట్లు ప్లాన్ చేయగా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఆదివారం సాయంత్రం మిలిట్రీ మాధవరంలో నిర్వహించారు. తాను చాలా శిలా విగ్రహాలను చూశానని.. ఈ ఊళ్లోకి అడుగు పెట్టగానే ఓ సైనికుడి విగ్రహం చూశానని.. ఒళ్లంతా గగుర్పొడించిందని అన్నాడు దర్శకుడు వక్కంతం వంశీ.
తాను ఎన్నో ఆడియో ఫంక్షన్స్ కు అటెండ్ అయినా.. ఇది తనకు దర్శకుడిగా తొలి చిత్రం కావడంతో టెన్షన్ గానే ఉన్నానని చెప్పిన వక్కంతం వంశీ.. తనకు ఇది మూడున్నర సంవత్సరాల కల అంటున్నాడు. చెప్పేందుకు కాస్త అతిశయోక్తిగా ఉన్నా.. తన కలను తీర్చిన మగాడు అల్లు అర్జున్ అంటూ.. తన హీరోను పొగిడాడు వక్కంతం. ఈ సినిమాకు ముందు తాను కనీసం సెల్ ఫోన్ తో కూడా ఒక్క షాట్ కూడా తీయలేదని.. దర్శకత్వంలో కనీసమాత్రం అనుభవం కూడా లేదని.. అయినా సరే తనను తన కథను నమ్మి ఇంతటి సినిమా ఇచ్చినందుకు బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు వక్కంతం వంశీ.
ఈ చిత్రంలో బన్నీ ఏడిపిస్తాడని.. నవ్విస్తాడని.. కోపం తెప్పిస్తాడని.. ఓ పదేళ్లపాటు మనసులను వెంటాడుతూ గుర్తిండిపోయే పాత్ర అవుతుందని చెప్పిన వక్కంతం.. ఓ 10 హిట్టు సినిమాలు అందించిన దర్శకుడి లాగా తనను బన్నీ ట్రీట్ చేసిన విధానం చూసి.. ఇప్పటికీ ఆశ్చర్యపోతూనే ఉంటానని చెబుతున్నాడు.