తళా అజిత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే దానిపై అభిమానుల్లో ఎంతో ఆసక్తికర డిబేట్ రన్ అవుతుంటుంది. అతడి గెటప్ ఎంపిక చేసుకున్న పాత్ర.. నటన.. ఆహార్యం.. యాక్షన్ ఇలా అన్ని కోణాల్లోనూ డిస్కషన్ ఉంటుంది. అతడు నటించిన పింక్ రీమేక్ `నేర్కొండ పార్వై` ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజిత్ వాలిమై అనే చిత్రంలో నటిస్తున్నాడు. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తళా పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. నేర్కండ పార్వై నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా వాలిమై మొదటి పోస్టర్ విడుదలైంది. అధికారిక మోషన్ పోస్టర్ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతోంది. నిర్మాత బోనీ కపూర్ పంచుకున్న మోషన్ పోస్టర్ అజిత్ అభిమానులు ఊహించనంత పదునైనది.. వేగవంతమైనది..`శక్తి మనస్సు స్థితి` అన్న ట్యాగ్ తో పోస్టర్ వైరల్ అవుతోంది. కాప్ పాత్రలో అజిత్ ఎంతో స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇక ఇందులో బైక్ రేసర్ తరహాలో అజిత్ దుమారం ఓ రేంజులో ఎలివేట్ చేశారని అర్థమవుతోంది.
మోషన్ పోస్టర్ మే 1న అజిత్ 50వ పుట్టినరోజున విడుదల కావాల్సి ఉందిడగా.. కరోనావైరస్ మహమ్మారి రెండవ వేవ్ కారణంగా పోస్టర్ విడుదలను వాయిదా వేసారు. బోనీకపూర్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. వాలిమై ఫస్ట్ లుక్ ఆలస్యం కావడానికి కారణాలను వెల్లడించారు.
``సెకండ్ వేవ్ సునామీ లాగా భారతదేశం అంతటా వ్యాపిస్తుందని మనలో ఎవరూ ఊహించలేదు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కోల్పోవడం వల్ల లక్షలాది మంది భారతీయులు ఆర్థిక ఇబ్బందులు మానసిక గాయాలతో బాధపడుతున్నారు.. అందుకే ఈ వాయిదా`` అని ఆ ప్రకటనలో బోనీ పేర్కొన్నారు. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన గెటప్పుల్లో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన అజిత్ ఈసారి వాలిమైలో అంతకుమించి ఛాలెంజింగ్ పాత్రతో మైమరిపించనున్నారని అర్థమవుతోంది.
అజిత్ తన అభిమానులను కూడా ఓపికగా ఉండమని కోరాడు. ``సినిమా మీకు వినోదం మాత్రమే. కానీ నాకు ఇది నా వృత్తి. నా నిర్ణయాలు నా పని సామాజిక సంక్షేమం మీద ఆధారపడి ఉంటాయి. ఈ సమాజంలో మన గౌరవం మన చర్యల ద్వారా నిర్ణయించబడుతుంది`` అని ఒక ప్రకటనలో అజిత్ తెలిపారు. హుమా ఖురేషి- కార్తికేయ గుమ్మకొండ కూడా `వాలిమై`లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2017 లో విడుదలైన తీరన్ అధికారమ్ ఒండ్రూ పేరుతో చిరస్మరణీయమైన కాప్ చిత్రాన్ని తెరకెక్కించిన వినోద్ మరో ఛాలెంజింగ్ మూవీని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. హిందీ చిత్రం పింక్ అధికారిక తమిళ రీమేక్ అయిన నెర్కొండ పార్వై తర్వాత అజిత్ -బోనీ కపూర్ లతో వినోద్ వరుసగా రెండవసారి యాక్షన్ సినిమా చేస్తున్నారు.