ఈ వివాదం ఎక్కడి దాకా?

Update: 2019-01-07 06:38 GMT
నిన్న పేట ప్రీ రిలీజ్ లో నిర్మాత వల్లభనేని అశోక్ థియేటర్ల మాఫియా గురించి చేసిన కామెంట్స్ ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. ఇప్పటికే ఫిలిం నగర్ లో దీని గురించి హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పేటకు థియేటర్లు దక్కనివ్వకుండా అడ్డుపడుతున్నారని అల్లు అరవింద్-దిల్ రాజు-యువిలను ఉద్దేశించి అభ్యంతరకర భాషలో ఆయన చేసిన కామెంట్స్ గురించి ఇప్పటికే వేడి రాజుకుంది. ఇంకా ప్రతిస్పందన రానప్పటికీ ఎవరికి వారు తమ తమ సంక్రాంతి సినిమాల విడుదల హడావిడిలో ఉన్నారు కాబట్టి కొంత టైం పట్టినా రెస్పాన్స్ అయితే వస్తుంది.

కానీ ఇప్పుడు ఈ థియేటర్ల రచ్చ మాత్రం మరోసారి చర్చలోకి వస్తోంది. అయితే అశోక్ లేవనెత్తిన పాయింట్ సరైనదే అయినప్పటికీ దాన్ని వ్యక్తం చేసిన తీరు మాత్రం సమర్ధనీయం కాదు. అసలు ప్లానింగ్ లేకుండా హఠాత్తుగా పేట డేట్ ను ప్రకటించి అప్పటికే షెడ్యూల్ చేసిన తెలుగు సినిమాలకు సమానంగా డబ్బింగ్ సినిమాకు ఇవ్వాలని డిమాండ్ చేయడం సబబు కాదు. పేటకు తమిళనాడు లో ఇక్కడ బిల్డప్ ఇచ్చుకున్నంత క్రేజ్ లేదు. దీని కంటే అజిత్ విశ్వాసంకే ఎక్కువ ప్రీమియర్లు పడుతున్నాయని అక్కడి ట్రేడ్ రిపోర్ట్స్ ని బట్టి తెలుస్తోంది. సో తెలుగులో సహజంగానే థియేటర్లు తక్కువగా దొరుకుతాయి.

అందులోనూ బాలకృష్ణ-వెంకటేష్-రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు పోటీగా ఉన్నప్పుడు ఇది సర్వసాధారణం. పైగా ఈ మూడింటి మీద కలిపి సుమారు 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అలాంటప్పుడు భారీ విడుదలతో పాటు ఓపెనింగ్స్ చాలా కీలకం. అది న్యాయం కూడా. అంతేతప్ప ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం మాట అటుంచి ఇది ఇంకా జఠిలం అవుతుంది. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.


Full View

Tags:    

Similar News