మెగా ప్రిన్స్ కి అసలు పరీక్ష

Update: 2019-06-06 04:41 GMT
ఎఫ్2 ఇండస్ట్రీ హిట్ సాధించినా అందులో వెంకటేష్ కు ఎక్కువ క్రెడిట్ దక్కడంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో సోలో సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది తొలిప్రేమతో ఓ బ్లాక్ బస్టర్ ని అంతరిక్షం రూపంలో ఓ డిజాస్టర్ ని సమానంగా అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు రాబోయే వాల్మీకి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. నెగటివ్ షేడ్స్ కొంత టచ్ చేస్తూ చాలా టిపికల్ గా అనిపించే డిఫరెంట్ రోల్ ని ఇందులో ట్రై చేస్తున్నాడు.

ఊర మాస్ అనిపించే తరహాలో ఇప్పటికే లీకుల రూపంలో బయటికి వచ్చిన స్టిల్స్ లో వరుణ్ చూసి ఇతనేనా అని అభిమానులు సైతం ఆశ్చర్య పోయారు. అతి త్వరలోనే ప్రీ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో రంజాన్ సందర్భంగా ప్రకటించాడు. వాల్మీకి ఎలా ఉండబోతుందన్న క్యురియాసిటికి అది కొంత సమాధానం ఇస్తుందనే ఎదురు చూస్తున్నారు ఫాన్స్.

ఇది నాలుగేళ్ల క్రితం వచ్చిన తమిళ్ హిట్ జిగర్ తండాకు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. వివిధ మాధ్యమాల్లో ఇప్పటికే దీని వెర్షన్ ని చూసినవాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. సో దానితో పోలిక రాకుండా హరీష్ శంకర్ దీన్ని ఎలా తీర్చిదిద్ది ఉంటాడా అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంది. పైగా చాలా గొప్పగా చెప్పుకున్న డిజే ఫలితం నిరాశ పరచడంతో పాటు విమర్శకులను అవసరానికి మించి దుమ్మెత్తి పోయడం అప్పట్లో హరీష్ ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

అందుకే వాల్మీకికి వాటితో సమాధానం చెప్పాల్సిన బాద్యత అయితే ఉంది. అధర్వ హీరో తరహ పాత్రలో నటిస్తున్న వాల్మీకిలో ఇంతకీ పూజా హెగ్డే ఉందా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. ఇంకో నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే ప్లాన్ లో ఉంది యూనిట్. సైరా అఫీషియల్ గా ప్రకటించాక దీని విడుదల తేదిని డిసైడ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News