వాకా వాకా: వారేవా.. జబర్దస్త్ కాకా

Update: 2019-09-12 15:58 GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్మీకి'.  ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఇప్పటికే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్.. లిరికల్ సాంగ్స్ వరసగా రిలీజ్ చేస్తూపోతున్నారు.  తాజాగా ఈ సినిమా నుండి 'వాకా వాకా' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

వాల్మీకి చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడనే సంగతి తెలిసిందే.  ఈ వాకా వాకా పాటకు సాహిత్యం అందించినవారు చంద్రబోస్.  ఈ పాటను పాడినవారు అనురాగ్ కులకర్ణి. ఈ పాట సాహిత్యం అంతా వరుణ్ తేజ్ పాత్ర స్వభావాన్ని స్వయంగా తనే చెప్పుకుంటున్నట్టుగా సాగుతుంది.  "దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దించుడే.. అడ్డం వచ్చినోడ్ని సంపుడే అద్దు పద్దులన్నీ సింపుడే" అంటూ చంద్రబోస్ ఫుల్లు మాసు స్టైల్ లో సాహిత్యం అందించారు. ఇక ఈ పాటను ఒకరకమైన రాపు గొంతుతో అనురాగ్ కసిగా పాడారు. ముఖ్యంగా ఆ 'వాకా వాకా వాకా వాకా' అనే లైన్ మాసు సంగీత సాహిత్య కళాభిమానులకు మత్తుగా అనిపించేలా ఉంది.   లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. మిక్కీ జే మేయర్ ఈ పాటకు ట్యూన్ అందించాడు అంటే సడన్ గా నమ్మలేం.. ఒక్క ముక్కలో చెప్తే మిక్కీ రఫ్ఫాడించాడబ్బా!

ఈ పాటకు చార్ట్ బస్టర్ అయ్యే లక్షణాలు ఫుల్లుగా ఉన్నాయని అనిపిస్తోంది. ఇక పాట మధ్యలో వరుణ్ "ఏం రో.. ఇంటున్నావ్ రా" అంటూ చెప్పే డైలాగ్ ఒక్కసారి వరుణ్ మాస్ అవతారాన్ని గుర్తు చేస్తుంది. అలస్యం ఎందుకు.. చూసేయండి!


Full View

Tags:    

Similar News