కరోనా పుణ్యమా అంటూ గత 7 నెలలుగా థియేటర్లు తెరుచుకోలేదు. అన్ లాక్ లో భాగంగా ఇపుడు థియేటర్లు తెరిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ....జనాలు పెద్దగా థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే తెరచిన ఒకటీ అర థియేటర్లకు రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదు. ఆల్రెడీ లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఓటీటీలకు గతంతో పోలిస్తే విపరీతమైన ఆదరణ వచ్చింది. స్కామ్ 1992, మిర్జాపుర్-2 వంటి హిందీ వెబ్ సిరీస్ లకు మంచి వ్యూయర్ షిప్ వచ్చింది. తెలుగులోనూ కొందరు దర్శకనిర్మాతలు వెబ్ సిరీస్ లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో విలక్షణ దర్శకుడిగా పేరున్న వంశీ కూడా వెబ్ సిరీస్ ల బాట పట్టబోతున్నారని టాక్ వస్తోంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వంశీ కూడా ఓ ఓటీటీ కోసం వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారట.
మహర్షి, చెట్టు కింద ప్లీడర్, లేడీస్ టైలర్, సితార, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదావరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు వంశీ దర్శకత్వం వహించారు. దాదాపుగా వంశీ తీసిన అన్ని సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్ లో తీసినవే. తాజాగా తీయబోతోన్న వెబ్ సిరీస్ లోనూ గోదావరి అందాలను మరింత అందంగా చూపించబోతున్నారట. గోదావరి పరివాహక ప్రాంతం, అక్కడి ప్రజల రుచులు, అభిరుచులు, యాస, భాష, చరిత్ర, గోదావరి నుంచి వచ్చిన సెలబ్రెటీలూ వంటి విషయాలన్నీ కలగలిపి ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారట. దాదాపుగా డాక్యుమెంటరీ స్టైల్లో సాగే ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ కోసమే అని టాక్ వస్తోంది. ఈ తరహా డాక్యుమెంటరీలను నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేసింది. మరోవైపు, తెలుగు ఓటీటీ ఆహా కూడా కొత్త కంటెంట్ కోసం వెతుకుతోంది. మరి, వంశీ తీయబోతోన్న ఈ వెబ్ సిరీస్ ఎవరు దక్కించుకుంటారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.