పైడిపల్లి చివరికి అతడితో ఫిక్సయ్యాడా..

Update: 2016-06-26 11:30 GMT
కాస్త పేరున్న ఓ దర్శకుడు ఓ హిట్ ఇచ్చాక అతడి తర్వాతి సినిమా విషయంలో జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ సినిమా ఏదో తెలుసుకోవడానికి ఉబలాటపడతారు. ‘ఊపిరి’ లాంటి మెమొరబుల్ మూవీ అందించిన వంశీ పైడిపల్లి నుంచి వచ్చే తర్వాతి సినిమా కోసం కూడా టాలీవుడ్ జనాలు అలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని కుర్రాడు అఖిల్ తో ఓ సినిమా ఇక సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అన్నంత వరకు వచ్చింది కానీ.. చివరికి అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మహేష్ బాబుకు ఓ కథ చెప్పి చూశాడు కానీ.. అదీ వర్కవుట్ కాలేదు. ఐతే చివరికి వంశీ.. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో సినిమా చేయడానికి తయారవుతున్నట్లు సమాచారం.

ఓ దర్శకుడి తర్వాతి సినిమా ఏంటన్నది అతడు హాజరయ్యే సినిమా వేడుకల్ని బట్టి కూడా ఓ క్లారిటీ వస్తుంటుంది. నిన్న వంశీ.. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘తిక్క’ ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యాడు. నిజానికి ఈ ప్రాజెక్టుతో వంశీకి ఏ సంబంధం లేదు. అయనా వచ్చాడంటే సాయిధరమ్ తో సినిమా చేయబోతున్నాడనే అంటున్నారు జనాలు. వంశీకి మెగా హీరోలతో మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘ఎవడు’ సినిమా తీశాడు. ‘ఊపిరి’ లాంటి సినిమా తర్వాత సాయిధరమ్ తో సినిమా అంటే వంశీ కొంచెం స్థాయి తగ్గించుకున్నట్లే కానీ.. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్న సాయిధరమ్ తో అతను సినిమా చేస్తే దానికి మంచి హైప్ వచ్చి పెద్ద రేంజికి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ‘తిక్క’ తర్వాత సాయిధరమ్.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిటై ఉన్నాడు.
Tags:    

Similar News