కొట్టు కొట్టు.. కాపీ కొట్టు... కాఫీ తాగినంత ఈజీగా కాపీ కొట్టు.. అన్నట్లుగా ఉంటుంది మన సినిమాల సంగతి. నాగార్జున, కార్తీ, తమన్నాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి దర్శకుడు వంశీపైడిపల్లి. ఇతగాడు గతంలో తీసిని ఎవడు కోసం.. హాలీవుడ్ మూవీ ఫేస్ ఆఫ్ థీమ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నాగార్జున, కార్తీలతో మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం కూడా మరో విదేశీ చిత్రం నుంచే ప్లాట్ ఎంచుకున్నాడు వంశీ పైడిపల్లి. ది ఇన్ టచబుల్స్ అనే ఫ్రెంచ్ మూవీ కాన్పెప్ట్ తో ఈ సినిమా రూపొందనుందని టాలీవుడ్ టాక్. తాజాగా షూటింగ్ కు సంబంధించిన ఒక ఫోటోతోనే ఈ విషయం తెలిసిపోయింది జనాలకు. నాగార్జునను కుర్చీలో పెట్టుకుని కార్తీ తోసుకెళ్లే సీన్ షూట్ చేస్తున్న సీన్ లోది ఈ ఫోటో.
ఓ ధనవంతుడు తనకు కేర్ టేకర్ గా ఒక వ్యక్తిని నియమించుకుంటాడు. ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇతడు.. గతంలో ఓ దొంగ. కానీ మల్టీ మిలియనీర్ కి మాత్రం ఈ దొంగ కేరక్టర్ నచ్చుతుంది. యాక్సిడెంట్లో ఇలా కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి తలెత్తినపుడు కేర్ టేకర్ ను నియమించుకుంటాడు. ఈ ధనవంతుడు ప్రేమించిన వ్యక్తితో కలిపేందుకు... మన మాజీ దొంగగారు ప్రయత్నిస్తారు. ఇదీ ఫ్రెంచ్ సినిమా ప్లాట్. స్టోరీ బాగానే ఉంది. అసలే లోకలైజ్ చేయడంలో వంశీ పైడిపల్లి దిట్ట. ఇక ఈ కామెడీ డ్రామాను బాగానే తెరకెక్కిస్తాడని భావించచ్చు. కానీ సొంత కథలు కాకుండా.. అన్నిటికీ ఇలా విదేశీ భాషల మీదే ఆధారపడితే ఎలా వంశీ ?