''అసలు ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో చెప్పలేను. ఈ 'ఊపిరి' సినిమాను తీయడానికి నాతో పాటు ఒక అసిస్టెంట్ డైరక్టర్ లా పనిచేశారు కార్తి సార్..'' అని చెబుతూనే ఏడ్చేశాడు వంశీ పైడిపల్లి. దాదాపు బయటకు వచ్చేసిన కన్నీళ్ళను ఆపుకుని.. ''కార్తి చాలా గ్రేట్. అంత సింపుల్ స్టార్ నేనెప్పుడూ చూడలేదు. అసలు ఇంతగా ఎమోషనల్ అయిపోవడానికి ఒక కారణం ఉంది.
అదేంటంటే.. కరెక్టుగా ''ఊపిరి'' సినిమా షూటింగ్ మొదలెట్టి మార్చి 1.. 2016కు రెండు సంవత్సరాలు అయ్యిందట. వంశీ ఎమోషనల్ టాక్ వెనుక చూస్తే.. ఈ సినిమాను ముందుగా నాగ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అనుకున్నారు. కాని ఎన్టీఆర్ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇవ్వడంతో.. వంశీ సందిగ్దంలో పడ్డాడు. అప్పుడు కార్తి ఒక్కడే ఆదుకున్నాడు. అందుకే వంశీకి కార్తి అంటే ఒక గౌరవం. అదే చెప్పుకొచ్చాడు.
ఇకపోతే 'ఊపిరి' సినిమాకు ఒక మ్యాజిక్ లేయర్ గా ఇటు నాగ్ అటు కార్తి లు ఇరగదీశారని ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. మొత్తానికి ఎవడు సినిమా తీశాక ఏకంగా మూడేళ్ల తరువాత ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గరకు రానున్నాడు. ఇతగాడి కష్టం అంతా బాక్సాఫీస్ సక్సెస్ రూపంలో కిక్కివ్వాలని కోరుకుందాం.