నాగార్జున - కార్తీలు హీరోలుగా ఊపిరి అంటూ మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇవాళే రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి మాస్ జనాల వరకూ బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా నాగ్ పాత్ర క్లాస్ ను కట్టిపడేస్తే, కార్తి రోల్ మాస్ ను అట్రాక్ట్ చేసింది. ఓవరాల్ గా అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ రావడంతో.. ఇప్పటికే హిట్ అనిపించేసుకుంది.
అయితే ఓ విషయంలో మాత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్స్ కి ఇది రీమేక్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశాక.. ఊపిరి సినిమా రీమేక్ కాదని, అడాప్షన్ అని ఓ మాట చెప్పాడు వంశీ. కానీ సినిమాలో కంటెంట్ చూస్తే అలాగేం లేదు. ఎమోషన్స్ నుంచి సీన్స్ వరకూ అన్నిటినీ ఒరిజినల్ లో ఉన్నవాటిని యాజ్ ఇటీజ్ గా దించేశారు. ఎక్కడా రిస్క్ కూడా చేయలేదు. కాన్సెప్ట్ ని ఇండియనైజ్ చేయడంలో బాగానే సక్సెస్ అయినా.. ఇందుకోసం ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాట్లేమీ లేవు.
పైగా తెలుగు కోసం తగిలించిన పాటల్లాంటివి స్టోరీకి అడ్డం పడ్డాయి తప్ప అడ్వాంటేజ్ మాత్రం కాలేదు. ఇవేమీ మెయిన్ స్టోరికి అదనంగా జోడించినవి కాదు. లెంగ్త్ పెరగడం కోసం చేసుకున్న హంగామా మాత్రమే. మరి కాన్సెప్ట్ ని, సీన్స్ ని మక్కీకి మక్కీ దింపేశాక ఇది రీమేక్ కాదు, అడాప్షన్ అనడం మాత్రం కామెడీనే. కాకపోతే ఫ్రీమేక్ చేయకుండా రీమేక్ చేయడం ఒక్కటే అభినందిచదగ్గ విషయం. ఇక ఎలగూ హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి.. వంశీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు కానీ.. నెక్ట్స్ అఖిల్ తో సినిమా విషయంలోనూ రీమేక్ కే వంశీ పైడిపల్లి మొగ్గు చూపుతుండడం ఆశ్చర్యకరమే.