అదేంటి మహేష్ భరత్ అనే నేను సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాడు కదా ఈ న్యూ యార్క్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. తను ప్రత్యక్షంగా కాకపోయినా మహేష్ తరఫున ఆ సినిమా ఏర్పాట్ల కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి అక్కడికి వెళ్లి కెమెరామెన్ కెయు మోహనన్ తో కలిసి లొకేషన్ వేటలో పడ్డాడు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ షేర్ చేసుకున్న వంశీ మోహనన్ కెమెరాలో న్యూ యార్క్ అందాలపై ఒక లుక్ వేసుకోండి అంటూ శాంపిల్ కూడా వదిలాడు. సో మహేష్ త్వరలోనే న్యూ యార్క్ లో కాలు పెట్టనున్నాడు అనే క్లారిటీ వచ్చినట్టే. కాకపోతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో మాత్రం వంశీ చెప్పలేదు.
భరత్ అనే నేను తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు మహేష్ బాబు 25వ సినిమా కావడం కూడా దీని మీద హైప్ ని పెంచుతోంది. దానికి తోడు పూజా హెగ్డే హీరొయిన్ కావడం అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో కనిపించడం లాంటి స్పెషల్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఈ ఏడాది వస్తుందా రాదా అనే దాని గురించి క్లారిటీ లేదు కాని పెడుతున్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మహేష్ ఫాన్స్ ఈ ఏడాది భరత్ అనే నేనుతోనే సర్దుకుపోవాల్సి వచ్చేలా ఉంది. వంశీ పైడిపల్లి ఊపిరి తర్వాత ఈ సినిమా కోసమే చాలా గ్యాప్ తీసుకుని వర్క్ చేస్తున్నాడు. భరత్ అనే నేను జోరు తగ్గాక మహేష్ దీని గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు-అశ్వినిదత్ నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్.