వాస్తవ కథలను సినిమాలుగా తెరకెక్కించడంలో తనదైన స్టైల్ చూపించడం, వాటిపై అమితమైన ఆసక్తిని రేకెత్తించడంలో రామ్ గోపాల్ వర్మ కు రామ్ గోపాల్ వర్మే సాటి! ఇప్పటికే రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ లతో సంచలనాలు సృష్టించిన వర్మ... తాజాగా "వంగవీటి", అనంతరం "నయీం" చిత్రాలను తెరకిక్కిస్తోన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో అక్టోబర్ 2న "వంగవీటి" ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ ఆన్ లైన్ లో సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ను అతితక్కువ సమయంలో లక్షలాది మంది వీక్షించారు. విజయవాడలో అప్పట్లో నెలకొన్న పరిస్థితులను వర్మ కళ్లకు కట్టినట్లు ఈ ట్రైలర్ లో చూపించాడని పలువురు అభిప్రాయపడ్డారు కూడా.
కేవలం సినిమా రంగమే కాకుండా రాజకీయ నేతలు, సాదారణ ప్రజలు కూడా ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దేవుడినే నమ్మనని చెప్పే వర్మ దుర్గమ్మ ఆశీస్సులు కావాలంటు ట్వీట్ చేశాడు. వర్మ ఈ పోస్ట్ వ్యంగంగా పెట్టారనే అభిప్రాయం చాలమందిలో ఉన్న సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ ట్వీట్ సారాంశం మాత్రం దుర్గమ్మ ఆశీస్సుల కోసం అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు కాపు కాచే కమ్మనైన వంగవీటికి సంబంధించిన కొన్ని షూట్లు నెట్‌లో పెడుతున్నట్లు ప్రకటించాడు. ఇలా ప్రకటించినట్లు గానే ఆ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది.
దసరా శుభాకాంక్షలతో అంటూ మొదలైన ఈ ట్రైలర్ "చంపరా... చంపేయ్యరా" అనే బ్యాగ్రౌండ్ సాంగ్ తో ముగుస్తుండగా... చివర్లో "నో థాంక్స్ ఫర్ నాట్ వాచింగ్" అని ముగుస్తుంది. వర్మా మజా...! కాగా, బెజవాడ వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Full View