ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మతో పెట్టుకున్నందుకు తలపట్టుకుంటున్న పరిస్థితి. ఎన్టీఆర్ మీద వర్మ తీయబోయే సినిమా విషయంలో విమర్శలు గుప్పించిన సోమిరెడ్డికి అటు నుంచి గట్టిగా కౌంటర్లు పడ్డాయి. సోమిరెడ్డి లాంటి పెద్ద నేతకే వర్మ ఇచ్చిన కౌంటర్లకు దిమ్మదిరిగిన పరిస్థితి. ఐతే ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్.. ఇప్పుడే తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెడుతున్న వాణీ విశ్వనాథ్.. వర్మతో పెట్టుకుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానన్న వర్మకు ఆమె వార్నింగులిచ్చింది. ఈ సినిమా తీయడం మానుకోవాలని.. లేకుంటే వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించడం విశేషం.
ఎన్టీఆర్ సినిమా తీసే ప్రయత్నాన్ని వర్మ వెంటనే విరమించుకోవాలని వాణీ విశ్వనాథ్ హెచ్చరించింది. ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమా తీస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె అంది. మొండిగా సినిమా తీస్తానని ముందుకు వెళ్తే తాము ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించింది. అసవరమైతే వర్మ ఇంటిముందు ధర్నా చేస్తామంది. ప్రజలు దేవుడిలో రాముడిని.. కృష్ణుడిని చూసుకుంటున్నారని.. అలాంటి వ్యక్తిపై గొప్పగా సినిమా తీస్తే ఎవరికీ అభ్యంతరాలు లేవని.. కానీ ఇష్టారీతిన తీయాలనుకుంటే మానేయడం మంచిదంది. వర్మ తీయబోయే సినిమాపై జనాలకు చాలా అనుమానాలున్నాయని.. దురుద్దేశంతోనే వర్మ ఈ సినిమా తీయాలనుకుంటున్నాడని ఆమె మండిపడింది. బాలయ్య ఎన్టీఆర్ మీద సినిమా తీయాలనుకుంటున్న సమయంలోనే వర్మ ఎందుకు ఈ సినిమాను ప్రకటించారని.. వర్మ ఈ సినిమాకు పెట్టిన పేరులోనే వ్యాపారం.. వివాదం దాగున్నాయని ఆమె అభిప్రాయపడింది.