ఆరుబయట మార్కెట్లో రద్దీ స్థలాల్లో ఆఫీసుల్లో జనం మాస్క్ ను ఎలా ధరిస్తున్నారు? ఏమరుపాటుగా ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో రెగ్యులర్ గా చూసేదే. ఇలా మాస్క్ రూల్ ని బ్రేక్ చేస్తే కోవిడ్ సోకకుండా ఉంటుందా? సెకండ్ వేవ్ విలయంలో ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా కోవిడ్ వెంటపడి తరుముతోంది. థర్డ్ వేవ్ లోనూ ఈ ముప్పు పెద్దగానే ఉండనుంది.
అందుకే అలాంటివాళ్ల కు కనువిప్పు కలిగించేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ టీమ్ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. మాస్క్ ధరించే వాళ్లలో ఫన్నీ ఎలిమెంట్ ని తీసుకుని చక్కని సందేశంతో రూపొందించిన ఈ చిన్న వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది.
``అద్భుతమైన ఈ వీడియో.. నేను అడిగిన వెంటనే చేసినందుకు ధన్యవాదాలు .. !! అబ్బాయిలను చాలా ప్రేమిస్తున్నాను .. !! మా నుండి మీకు ఏదో సరదాగా ఇవ్వాలని .. మాస్క్ ఎలా ధరించాలి? అనే కాన్సెప్ట్ ను చేశాం.. అని వరలక్ష్మి ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ వెల్లడించారు. ఈ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్ సహా రెజీనా కాసాండ్రా- విద్యూరామన్ -సందీప్ కిషన్ -యాక్టర్ కృష్ణ- నటుడు సతీష్- ప్రియదర్శి - యోగిబాబు ఉన్నారు.

Thank you for being so awesom n cool..thank u all for doing it as soon as I asked u..!! Love you guys so much..!!Something fun from us to you..
How to wear a Mask