వ‌ర‌ల‌క్ష్మి.. గోల్డెన్ లెగ్‌!

Update: 2021-06-17 11:30 GMT
ఎక్క‌డైనా స‌క్సెస్ తోనే ప‌ని. ఇక‌, సినిమా ఇండ‌స్ట్రీ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. విజ‌యం వెన‌కాల ప‌రుగులు పెడుతుంది. ఇక్క‌డ న‌మ్మ‌కాలకూ కొద‌వ లేదు. ఇంకా చెప్పాలంటే.. న‌మ్మ‌కాల మీద‌నే న‌డుస్తుంది. కొత్త‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వారిపై ఈ ప్ర‌భావం విప‌రీతంగా ఉంటుంది. సినిమా హిట్ అయితే.. గోల్డెన్ లెగ్ అంటూ.. ఫ్లాప్ అయితే.. ఐర‌న్ లెగ్ అంటూ ముద్ర వేసేస్తారు.

ఇలాంటి న‌మ్మ‌కాల వ‌ల్ల చాలా మంది ఒక‌టీ రెండు సినిమాల‌తో కెరీర్ ను క్లోజ్ చేసిన‌వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కొంత మంది మాత్రం వ‌రుస అవ‌కాశాల‌ను చేజిక్కిచుకొని ఇండ‌స్ట్రీలో నిల‌దొక్క‌కున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా ఉన్నారు. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ‘తెనాలి రామ‌కృష్ణ‌’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు.

ఆ త‌ర్వాత వచ్చిన ‘క్రాక్‌’ సినిమాలో జయమ్మ పాత్రతో దుమ్ములేపింది. ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ కావ‌డంతో.. వ‌ర‌ల‌క్ష్మి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ మ‌రో హిట్టు కూడా ఖాతాలో ప‌డ‌డంతో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అల్లరి నరేష్ మూవీ ‘నాంది’లో పవర్ ఫుల్ లాయర్ గా నటించి అదరగొట్టింది. సినిమాకు ఆయువు ప‌ట్టుగా ఉన్న ఆమె రోల్‌.. ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో.. డైన‌మిక్‌ లేడీ క్యారెక్ట‌ర్ కు వ‌ర‌ల‌క్ష్మినే ఫ‌స్ట్ అండ్‌ బెస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

ఈ స‌క్సెస్ జ‌ర్నీ కంటిన్యూ చేస్తూ.. బాల‌య్య‌-గోపీచంద్ మ‌లినేని కాంబోలో రాబోతున్న ఓ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మికి ప‌వ‌ర్‌ఫుల్ రోల్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా.. జాంబిరెడ్డి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న ‘హను..మాన్’లోనూ ప్రత్యేక పాత్రకు తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి.. తనదైన యాక్టింగ్ కు సక్సెస్ కూడా తోడవడంతో.. వరలక్ష్మి టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా మారిపోయిందని అంటున్నారు.
Tags:    

Similar News