ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బకు వారాహి సైలెంట్?

Update: 2019-11-07 11:05 GMT
డిస్ట్రిబ్యూటర్ గా సత్తా చాటుతూనే నిర్మాణరంగంలో ప్రవేశించి విజయాలు సాధించారు సాయి కొర్రపాటి.  వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఆయన నిర్మించిన సినిమాలు ఆయనకు మంచి అభిరుచి కల నిర్మాత అనే పేరును తీసుకొచ్చాయి.  అయితే గత కొంతకాలంగా ఆయన సైలెంట్ గా ఉన్నారు.  డిస్ట్రిబ్యూషన్ కూడా ఈమధ్య రెండు నెలల నుంచి ఆపేసినట్టుగా టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో రిలీజ్ ఎన్టీఆర్ బయోపిక్ ను పంపిణీ చేయడంతో తీవ్ర నష్టాలు వచ్చాయని.. ఆ ఎఫెక్ట్ తోనే సినిమాల పంపిణీ విషయంలో సాయి కొర్రపాటి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  సాయి కొర్రపాటి ఎప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా  మిత్రుడు రాజమౌళి సినిమా పంపిణీతో మళ్ళీ పుంజుకుంటారు. మరి ఈసారి కూడా 'RRR' తో సాయి కొర్రపాటిని రాజమౌళి కాపాడతారా అనేది చూడాలి.  

పోయినేడాది పంపణీ చేసిన సినిమాల్లో వారాహి వారికి లాభాలు తీసుకొచ్చిన చిత్రం 'కె.జీ.ఎఫ్: చాప్టర్ 1'.  వచ్చే ఏడాది 'కె.జీ.ఎఫ్: చాప్టర్ 2' రిలీజ్ కానుంది కాబట్టి ఆ సినిమా కూడా వారాహివారే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.  దీంతో వారాహి వారు ఇతర సినిమాల జోలికి పోకుండా ఈ రెండు భారీ చిత్రాలపైనే నమ్మకం పెట్టుకున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News