'క్రాక్' మాస్ రాజాను ఢీ కొట్టనున్న సర్కార్ లేడీ

Update: 2020-04-22 09:30 GMT
టాలీవుడ్ సినిమాలలో లేడీ విలన్స్ అంటే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. మన సినిమాలలో ఎక్కువగా హీరోలకు ధీటుగా నిలబడేది మగ విలన్స్ మాత్రమే. లేడీ విలన్స్ పాత్రలకు స్కోప్ ఉన్నా కూడా చాలా సాధారణ స్థాయిలో ఉంటాయి. అయితే పవర్ ఫుల్ లేడీ విలన్స్ మాత్రం తెలుగు సినిమాలలో చెప్పుకోవడానికి ఇంతవరకు ఎవరు లేరని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ లోటుని నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి భర్తీ చేస్తుంది. విలనిజం అంటే మగవాళ్ళు మాత్రమే పండించాలనే ఆలోచనల నుంచి దర్శకులని బయటకి తీసుకొచ్చి ఆడవాళ్ళతో కూడా పవర్ ఫుల్ విలనిజం చూపించవచ్చని ఈమె చేసిన పాత్రలతో ప్రూవ్ చేసింది. తమిళంలో పందెంకోడి - విజయ్ సర్కార్ మూవీలలో వరలక్ష్మి పండించిన విలనిజంకి చాలా మంది ప్రశంసలు లభించాయి.

ఇక అప్పటినుండి వరలక్ష్మిని ఎక్కువగా లేడీ విలన్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో విలనిజం పండించిన వరలక్ష్మి ఇప్పుడు మరో సినిమాలో కూడా తన పవర్ ఫుల్ విలనిజం చూపించడానికి రెడీ అవుతుంది. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న సినిమా క్రాక్. ఈ సినిమాలో వరలక్ష్మి చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతుందట. అయితే ఇది వరకు చేసిన సినిమాల తరహాలో కాకుండా ఆమె క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటూనే విలనిజం చూపిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ పాత్రతో తెలుగు సినిమాకు స్ట్రాంగ్ లేడీ విలన్ దొరికినట్లేనట. వరలక్ష్మి మరిన్ని సినిమాలలో విలన్ గా అవకాశాలు పొందడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఇక రవితేజని బలంగా ఢీ కొట్టే విధంగా ఈ పాత్ర ఉంటుందని టాక్. చూడాలి మరి ఏం జరగనుందో..!
Tags:    

Similar News