పుష్ప 2 ఫుట్‌ఫాల్‌తో మరో రికార్డు.. టాలీవుడ్‌లో బన్నీదే హవా!

ఇక ఈ సినిమా పోస్ట్-కోవిడ్ కాలంలోనే అత్యధిక ఫుట్‌ఫాల్ సాధించిన చిత్రం గా రికార్డుల్లో నిలిచింది.

Update: 2025-01-20 06:38 GMT

చిత్రసీమలో టాక్ తో సంబంధం.లేకుండా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే క్రేజ్‌ కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇక అలాంటి వారిలో అల్లు అర్జున్‌ కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. బన్నీ లేటెస్ట్ మూవీ "పుష్ప 2: ది రూల్" థియేటర్లలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లను రాబట్టి టాప్ రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఇక ఈ సినిమా పోస్ట్-కోవిడ్ కాలంలోనే అత్యధిక ఫుట్‌ఫాల్ సాధించిన చిత్రం గా రికార్డుల్లో నిలిచింది.

మొత్తం 7 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ చిత్రాన్ని ఆస్వాదించారు. అద్భుతమైన కథ, బాలీవుడ్ మార్కెట్లో భారీ వసూళ్లు, ఫ్యాన్స్ రచ్చ.. ఇలా పుష్ప 2 మరోసారి అల్లు అర్జున్‌ రేంజ్‌ను హైలైట్ చేసింది. పుష్ప 2 మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా థియేటర్ల వద్ద భారీగా ప్రేక్షకులను ఆకర్షించాయి.

కానీ పుష్ప 2 సాధించిన స్థాయికి ఎవరూ చేరలేకపోయారు. కేవలం 7 కోట్ల మందితో కాదు, ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ కొత్త రికార్డులను సృష్టించింది. బాలీవుడ్ లో అత్యదిక కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాగా కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. హిందీలోనే 800 కోట్లు రావడం విశేషం. ఇక పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడం విశేషం.

అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది కేవలం వసూళ్లలోనే కాదు, ప్రేక్షకుల ఆదరణలోనూ ఓ బిగ్గెస్ట్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు. పుష్ప: ది రైజ్ పుష్ప సిరీస్‌కు బలమైన పునాదిగా నిలవగా, పుష్ప 2 ఆ అంచనాలను మించిన స్థాయిలో ఆకట్టుకుంది. ఫ్యాన్స్‌ కాక, సాధారణ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించి చరిత్ర సృష్టించింది.

పోస్ట్ కోవిడ్ కాలంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి వచ్చిన 4.51 కోట్ల ఫుట్‌ఫాల్ మరో విశేషం. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు మరో రేంజ్ తీసుకువెళ్లింది. ఇక కల్కి 2898 ఎ.డి. 3.61 కోట్ల ఫుట్‌ఫాల్‌తో ప్రభాస్ కెరీర్‌కు కొత్త ఊపిరి ఇచ్చింది. అలాగే, సలార్ 2.70 కోట్ల ఫుట్‌ఫాల్ సాధించి ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్‌లో ఉన్న స్థాయిని మరోసారి నిరూపించింది.

అల్లు అర్జున్‌ పోస్ట్ కోవిడ్ కాలంలో అత్యధిక ఫుట్‌ఫాల్ కలిగిన రెండు సినిమాలను కలిగి ఉన్న ఏకైక టాప్ హీరోగా నిలిచారు. పుష్ప: ది రైజ్ 2.50 కోట్ల మందిని థియేటర్లకు రప్పించగా, పుష్ప 2 ఆ స్థాయిని దాటి మరోసారి తన సత్తా చాటారు. ఇది కేవలం టాలీవుడ్‌కే కాకుండా, భారతీయ చిత్రసీమకు గర్వకారణంగా నిలిచింది.

ఫుట్‌ఫాల్ రికార్డుల తెలుగు జాబితా

1. పుష్ప 2: ది రూల్ – 7 కోట్లు

2. ఆర్ఆర్ఆర్ – 4.51 కోట్లు

3. కల్కి 2898 ఎ.డి. – 3.61 కోట్లు

4. సలార్ – 2.70 కోట్లు

5. పుష్ప: ది రైజ్ – 2.50 కోట్లు

Tags:    

Similar News