గేమ్ ఛేంజర్ కు పుష్ప 2 దెబ్బ.. ఇదెక్కడి రికార్డు సామీ!
మరో షాకింగ్ విషయం ఏమిటంటే పుష్ప 2 కలెక్షన్స్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత కూడా ఇంకా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణం కొనసాగుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుండి మాస్ కమర్షియల్ చిత్రాలు వరకు పలు సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ముఖ్యంగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా భారీ టికెట్ విక్రయాలతో టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఈ చిత్రం మరింత ఉత్సాహాన్ని ప్రేక్షకుల్లో కలిగించి వీకెండ్ కలెక్షన్లను శ్రద్ధగా పెంచింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే పుష్ప 2 కలెక్షన్స్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లో ఉండడం విశేషం. అందులోనూ రీసెంట్ గా వచ్చిన పుష్ప 2ని బీట్ చేయడం మరో షాకింగ్ విషయం.
సంక్రాంతికి వస్తున్నాం
ముందుగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఆదివారం రోజే 2,41,910 టిక్కెట్లు అమ్ముకొని న్యూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకుముందు రోజు శనివారం, 349.9K టిక్కెట్లు అమ్ముడయ్యాయి. పోటీగా ఉన్న పెద్ద సినిమాలతో పోలిస్తే ఇంత పెద్ద సంఖ్యలో టిక్కెట్లు అమ్మడం అనేది గమనార్హం. వెంకటేష్ ప్రధాన పాత్రలో, ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతుంది. సపోర్టింగ్ ఆడియెన్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు.
డాకు మహరాజ్
మరోవైపు, నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" కు సంబంధించి ఆదివారం రోజు 42,800 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇక 52.97K శనివారపు రికార్డుకు కాస్త తగ్గుముఖం పట్టింది. మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇంకా కలెక్షన్లు కొనసాగిస్తోంది. పండుగ రేసులో తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. వీకెండ్ అనంతరం ఎలా ఉంటుందో చూడాలి.
పుష్ప 2
ఇక "పుష్ప 2: ది రూల్" కూడా ఈ రేసులో తన ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఆదివారం నాడు 27,760 టిక్కెట్లు అమ్ముడవగా, 26.98K శనివారపు ఫిగర్‌ను కొంచెం దాటి తన స్టామినాను చాటింది. 40 రోజుల తరువాత కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం విశేషం. అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమాకు భారీగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ప్రత్యేకంగా, ఈ సినిమా ఆదనపు నిడివి తో రావడం, అలాగే టిక్కెట్ రేట్లు తగ్గడం వలన బాగా కలిసొచ్చింది.
గేమ్ ఛేంజర్
పొలిటికల్ డ్రామాగా వచ్చిన "గేమ్ చేంజర్" ఆదివారం రోజు టిక్కెట్ల లెక్క కేవలం 23,330 వరకు మాత్రమే వచ్చింది. 25.60K శనివారం టిక్కెట్లతో పోలిస్తే కొంచెం తక్కువగా నిలిచింది. రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆసక్తిని ఆకర్షించడంలో కొంత వెనుకబడి ఉంది. ముఖ్యంగా 6 వారాల క్రిందట వచ్చిన పుష్ప 2 కంటే తక్కువ కలెక్షన్స్ రావడం షాకింగ్.
ఆదివారం బుక్ మై షో టిక్కెట్ల వివరాలు (తెలుగు)
1. సంక్రాంతికి వస్తున్నాం: 2,41,910
2. డాకు మహారాజ్: 42,800
3. పుష్ప 2: ది రూల్: 27,760
4. గేమ్ చేంజర్: 23,330
ఈ లిస్టులో "సంక్రాంతికి వస్తున్నాం" టిక్కెట్ అమ్మకాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మిగతా సినిమాలతో పోలిస్తే దూసుకుపోయింది. పండుగ సందర్బంగా ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి రావడం తెలుగు చిత్రసీమకు చాలా కీలకమైన విషయం. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమదైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. మరి ఫైనల్ లెక్కలు ఎంతవరకు వెళతాయో చూడాలి.