ఎంత స్టార్ లైనా వారు కూడా అమితంగా ఇష్టపడే వారు, ..అభిమానించే వారు, .. ప్రేమని కురిపించే వారు కూడా వుంటారు. తన చుట్టూ వున్న వారితో పాటు వ్యక్తిగత సిబ్బందిని కూడా తమ కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తూ వారి సుఖ దుఃఖాల్లోనూ పాలు పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇటీవల తన మేకప్ మెన్ కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షల్ని అందించి సూపర్‌స్టార్ మహేష్ అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అలాంటి పనినే తాజాగా హీరోయిన్, ..శరత్ కుమార్ గారాల పట్టి వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది.
తమిళ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ గా.., విలక్షణ నటిగా, ..విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేస్తూ అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. తమిళ తెరకే పరిమితం కాకుండా తెలుగులోనూ విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. ఇటీవల `క్రాక్`, ..నాంది చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుని తెలుగు, ..తమిళ భాషల్లో వరుస చిత్రాలతో యమ బిజీగా మారిపోయింది.
సోషల్ మీడియాలో నిత్యం యమ యాక్టీవ్ గా వుండే వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తన వ్యక్తిగత మేకప్ మెన్ రమేష్ తో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ దానికి ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. రమేష్ అన్నా .. నువ్వు లేకుండా నేను ఏమి చేయలేను..నా మేకప్ ఆర్టిస్ట్ రామేష్ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు .. నువ్వు నా మేకప్ మ్యాన్ మాత్రమే కాదు.. నీవు నా రైట్ హ్యాండ్వీ. మీరు లేకుండా ఇప్పటివరకు నేను ఏమీ చేయలేదు.. మీ పుట్టినరోజు బహుమతి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను` అంటూ ట్వీట్ చేసి తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.