ప్రభుత్వంపై వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-11-10 10:39 GMT
విజయ్‌ - మురుగదాస్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కిన ‘సర్కార్‌’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యావరేజ్‌ టాక్‌ ను దక్కించుకున్నా కూడా భారీ వసూళ్లను సాధిస్తూ రికార్డులను సృష్టించింది. తమిళనాట సంచలన వసూళ్లను సాధిస్తూ అప్పుడే 150 కోట్లను కొల్లగొట్టిన ఈ చిత్రంలో అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత గురించి వ్యతిరేకంగా ఉంది అంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో సినిమాను క్యాన్సిల్‌ చేస్తున్నారు - మరి కొన్ని ఏరియాల్లో సినిమా హాల్స్‌ వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. మొత్తం మీద మురుగదాస్‌ పై అన్నాడీఎంకే నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ప్రస్తుతం తమిళనాట అన్నాడీఎంకే అధికారంలో ఉన్న కారణంగా ‘సర్కార్‌’ చిత్ర దర్శకుడు మురుగదాస్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ అంతా అంటున్నారు. మురుగదాస్‌ అరెస్ట్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో లేడీ విలన్‌ పాత్ర పోషించిన వరలక్ష్మి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర ఆగ్రహంను ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం చేసింది.

ట్విట్టర్‌ లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. ఒక సినిమాని చూసి ఇంతగా భయపడుతున్నారు, మీ ప్రభుత్వం మరీ ఇంత బలహీనమా? మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ బలహీనతను మీరు బయట పెట్టుకున్న వారు అయ్యారు. ఇప్పటికైనా మీరు మీ తెలివి తక్కువ పనులు మానేయండి - క్రియేటివిటీకి సంకెళ్లు వేయాలని ప్రయత్నించడం ఏమాత్రం మంచిది కాదు అంటూ వరలక్ష్మి ట్వీట్‌ చేసింది.

వరలక్ష్మి ట్వీట్‌ కు అన్నా డీఎంకే కార్యకర్తలు మరియు నాయకులు తీవ్రంగానే స్పందించే అవకాశం ఉంది. వారు ఎలా రియాక్ట్‌ అవుతారు అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News