సొసైటీలో ఏదైనా ఒక అనూహ్య పరిణామం జరిగినపుడు.. ఒక ఇష్యూ రైజ్ అయినపుడు.. సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించేయడం.. ఆపై సైలెంటైపోవడం.. ఇదీ సెలబ్రెటీలు చాలా మంది చేసే పని. నిజంగా సమస్య పరిష్కారం కోసం కార్యరంగంలోకి దిగే వాళ్లు కొద్దిమందే ఉంటారు. తమిళ హీరోయిన్.. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన వరలక్ష్మి ఈ కోవకే చెందుతుంది. ఇటీవల మలయాళ కథానాయిక భావనను కొందరు కిడ్నాప్ చేసి.. ఆమెపై లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు చాలామంది గొంతెత్తారు. వరలక్ష్మి సైతం ఈ విషయమై గట్టిగా స్పందించింది. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా పంచుకుంటూ.. చాలా ఎమోషనల్ అయింది. ఇలాంటి విషయాల్లో పరిష్కారం కోసం ఏం చేయాలో చెప్పింది. ఐతే వరలక్ష్మి కేవలం ఆ ప్రకటనకే పరిమితం అయిపోలేదు. ఇండస్ట్రీలోని మహిళా కళాకారులకు రక్షణ కల్పించేందుకు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
ఈ నెల 8వ మహిళా దినోత్సవం రోజు ‘సేవ్ శక్తి’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపడుతోంది వరలక్ష్మి. ఇండస్ట్రీలోని మహిళా కళాకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె తన బృందంతో కలిసి సంతకాల సేకరణ చేపట్టనుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని.. ఆరు నెలల్లోగా ఈ కేసుల్లో తీర్పులు వచ్చేలా చేయాలని డిమాండ్ చేస్తున్న వరలక్ష్మి.. దీనిపైనా సంతకాలు సేకరించనుంది. సంతకాల సేకరణ తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వద్దకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని వరలక్ష్మి భావిస్తోంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/