సంక్రాంతి సినిమాల్లో ఖరీదైన సినిమా ఏదో తెలుసా..?

Update: 2022-12-01 11:42 GMT
ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ వీర సింహారెడ్డి మరియు విజయ్ వారసుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్‌ తమిళ సూపర్ స్టార్‌ అయినప్పటికి దర్శకుడు తెలుగు వ్యక్తి మరియు నిర్మాత తెలుగు వ్యక్తి.... తెలుగు లోనే సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు కనుక తెలుగు సినిమా గా పరిగణించాలి అనేది చర్చ.

ఆ విషయం పక్కన పెడితే ఈ సంక్రాంతికి ఏ సినిమా జోరు ఎంత.. ఏ సినిమా సత్తా ఎంత అనే చర్చ మొదలు అయ్యింది. గతంలో విజయ్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్‌ అయ్యాయి. కానీ ఏ ఒక్కటి కూడా భారీ వసూళ్లను మాత్రం దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఈసారి విజయ్‌ వారసుడు సినిమాకు మంచి మార్కెట్‌ జరుగుతోంది.

వంశీ పైడిపల్లి మరియు దిల్‌ రాజులు ఉండటం వల్ల వారసుడు సినిమా మ్యాజిక్ చేస్తుందని అంటున్నారు. ఇక సంక్రాంతికి ఈ మూడు సినిమాల మధ్య ప్రధానంగా పోటీ జరుగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల్లో ఏది ఖరీదైన సినిమా అంటూ చర్చ మొదలు అయ్యింది.

వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు వంద కోట్ల బడ్జెట్‌ కు కాస్త అటు ఇటుగా ఉంటాయి. హీరోల పారితోషికం తో కలుపుకుని కూడా వంద నుండి నూట ఇరువై అయిదు కోట్ల మధ్య లో ఉండే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. కానీ వారసుడు మాత్రం ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిందట.

విజయ్ కి దిల్ రాజు వంద కోట్లకు పైగా పారితోషికంగా ఇచ్చాడట. అంతే కాకుండా దర్శకుడు.. హీరోయిన్ ఇతర నటీ నటులకు 50 కోట్లకు మించి పారితోషికం ఇవ్వడం జరిగిందని.. మేకింగ్‌ కోసం దిల్‌ రాజు దాదాపుగా వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా రూ.250 కోట్ల బడ్జెట్‌ తో రూపొంది సంక్రాంతికి రాబోతుంది.

సంక్రాంతికి రాబోతున్న సినిమాల యొక్క బడ్జెట్‌ కాకుండా ఆ సినిమాల్లో ఉన్న మాస్‌ ఎలిమెంట్స్ మరియు ఇతర కమర్షియల్‌ ఎలిమెంట్స్ ను అభిమానులు మరియు ప్రేక్షకులు చూస్తారు. కనుక భారీ గా ఖర్చు చేసినంత మాత్రాన వారసుడు సినిమాకు తెలుగు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రావడం సాధ్యం అయ్యే పని కాదు అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News