ఎవరైనా నటి ఒక పాత్రకు సెట్ కాలేదు అనే విమర్శలు రావడం టాలీవుడ్ వరకూ రొటీనే. హీరోలు ఆ పాత్రలకు సెట్ అయ్యారా.. లేదా.. అనే సంగతిని ధైర్యంగా మీడియా ప్రస్తావించదు. అదే హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం రకరకాల కామెంట్లు ఈజీగా పాస్ అవుతాయి. ఇప్పుడు అలాంటి విమర్శల జడిలోనే నానుతోంది తమన్నా. అంధాదూన్ తెలుగు రీమేక్ లో తమన్నా చేసిన పాత్రపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వాటన్నింటి సారాంశం.. ఆ పాత్రకు ఆమె సెట్ కాలేదనేది.
హిందీలో టబూ ఆ పాత్రను పడించిన నేపథ్యంలో.. పాత్ర వయసు రీత్యా, నటన రీత్యా తమన్నా ఆ పాత్రకు సెట్ కాలేదు అని చాలా మంది అంటున్నారు. హిందీ వెర్షన్ ను చూసిన వారైతే.. అసలు తమన్నాను ఆఆ పాత్రలో చూడలేకపోతున్నట్టుగా స్పందిస్తున్నారు. డైరెక్టు తెలుగు వెర్షన్ ను మాత్రమే చూసే వాళ్లకు పెద్దగా ఇబ్బంది లేదు. అయితే రీమేక్ కావడంతో పోలికలు తప్పవు. ఇలాంటి నేపథ్యంలో తనపై వస్తున్న కామెంట్లపై తమన్నా స్పందించింది.
విమర్శలను ఆమె లైట్ తీసుకుంది. ఒక మంచి పాత్రను చేయాలనిపించింది, తనకు ఆ సంతృప్తి ఉందని తమన్నా అంటోంది. ముందుగా కొన్ని సీన్లను షూట్ చేశాకా... వాటిని చూసిన వారు బాగుందని కితాబివ్వడంతో తాము ధైర్యంగా ముందుకు వెళ్లినట్టుగా తమన్నా చెబుతోంది. ఆ భరోసాతోనే తను ఆ పాత్రను చేసినట్టుగా చెప్పింది. కొన్ని సీన్లను చేసే వరకూ ఆ పాత్ర విషయంలో తనకు కూడా డౌట్ ఉందన్నట్టుగా ఆమె స్పందనతో స్పష్టం అవుతోంది. ఎవరేమనుకన్నా ఫర్వాలేదన్నట్టుగా.. తన పాత్రకు తను న్యాయం చేసినట్టుగా, మంచి పాత్రను చేసిన సంతృప్తి తనకు ఉందని తమన్నా తేల్చేసింది.
మరి ఈ విమర్శల విషయంలో ఇలా స్పందించడం తప్ప తమన్నా చేయగలిగింది కూడా ఏమీ లేదు. అటు గ్లామర్ పాత్రలకూ, ఇటు క్యారెక్టర్ పాత్రలకూ.. సంధీదశలో ఉన్నట్టుంది తమన్నా. హీరోయిన్ గానే కాకుండా వివిధ రకాల పాత్రల ద్వారా ఇండస్ట్రీలో కొనసాగాలనే ఉద్దేశంలో ఆమె ఉంది. దీంతో విమర్శలను పట్టించుకోకుండా.. తన పని తను చేశానంటోంది.