దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా `వారీసు`. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీతో కోలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. తమిళంలో తనకిది రెండవ సినిమా. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఎప్పడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా అని విజయ్ బిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఇదే మూవీని `వారసుడు`గా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సంక్రాంతికి తమిళ, తెలుగు భాషల్లో జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్ల వివాదంకారణంగా వార్తల్లో నిలిచిన దిల్ రాజు వ్యాఖ్యల కారణంగా నెట్టింట వైరల్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు `వారీసు` ప్రమోషన్స్ జోరు పెంచేశాడు. ఇందులో భాగంగా ఈ మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్ ని బుధవారం విడుదల చేశారు.
ముందు నుంచి ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ప్రచారం చేస్తున్నట్టుగానే ట్రైలర్ లో అదే విషయాన్ని ప్రధానంగా చూపించారు. విజయ్ కి తల్లి పాత్రలో నటిస్తున్న జయసుధ డైలాగ్ లతో ట్రైలర్ మొదలైంది. ఉమ్మడి ఫ్యామిలీ నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని వంశీ పైడిపల్లి రూపొందించాడు. ఈ కాలంలో కూడా ఉమ్మడి ఫ్యామిలీ వుండటం గ్రేట్ సర్ ` అంటూ సుమన్ చెబుతున్న తీరు. `పవర్ సీట్లో వుండదు..కూర్చునే వ్యక్తిలో వుంటుంది..` అని విజయ్ అంటున్న పవర్ ఫుల్ డైలాగ్ లు, విజయ్ ఇంట్రడక్షన్ ఆకట్టుకుంటోంది.
తండ్రి శరత్ కుమార్ బిజినెస్ మెన్.. అతనికి ముగ్గురు తనయులు.. శ్రీకాంత్, శ్యామ్, విజయ్. హ్యాపీగా సాగిపోతున్న ఉమ్మడి ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ లాంటి విలన్ కారణంగా ముక్కలైతే ఆ ఫ్యామిలీని మళ్లీ ఒక్కటి చేయడానికి చిన్నవాడైన వారసుడు విజయ్ ఏం చేశాడు? .. తల్లిదండ్రుల ఆనందాన్ని ఎలా తిరిగి తెచ్చాడు? అనే కథగా ఈ సినిమా వుంటుందిని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కుటుంబపు విలువల్ని నేటి తరానికి తెలియజెప్పాలనే ప్రయత్నంలో ఈ సినిమా చేసినట్టుగా కనిపిస్తోంది.
అయితే ఈ తరహా కథలు ఇప్పటికే తెలుగులో లెక్కకు మించినవి రావడంతో విజయ్ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నది వేచి చూడాల్సిందే. సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీ మూస కథతో వస్తుండటంతో తెలుగు సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View