గ్రాఫిక్స్ వాడుకుంటూ.. అదే రొటీన్

Update: 2016-06-02 06:37 GMT
డిషూం.. జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రేసింగ్ థ్రిల్లర్. జాన్ అబ్రహం - వరుణ్ ధావన్ లు హీరోలుగా నటిస్తుండగా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కి రెండు రోజుల ముందు క్రికెటర్ విరాజ్(విరాట్ కోహ్లీ అంటే సమస్యలొస్తాయ్ కదా)ను కిడ్నాప్ చేస్తే.. రా ఏజంట్లు ఎలా సాల్వ్ చేశారన్నదే స్టోరీ. పాక్ లో ఐఎస్ ఐకి - ఇండియా రా కి.. డబ్బుకోసం పని చేసే అమ్మాయిగా జాక్వెలిన్.. విలన్ గా అక్షయ్ ఖన్నా.. మొత్తానికి కాస్టింగ్ - కాన్సెప్ట్ అదరహో అనాల్సిందే.

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఛేజింగ్ లు గట్రా చాలానే ఉన్నాయనే విషయం అర్ధమవుతుంది. అయితే.. ఇవన్నీ గ్రాఫిక్స్ మాయాజాలమే అని ఈజీగానే చెప్పచ్చు. మరి ఇంతలేసి గ్రాఫిక్స్ ని వాడుకుంటూ కూడా.. ఎంతసేపూ బాంబులు పేల్చుకోవడం - గోడలు బద్దలు కొట్టుకోవడమే ఎందుకుతీస్తారో అర్ధం కాని విషయం. హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ తోనే ఉంటాయ్. ఏకంగా ఆకాశంలో వెళ్లే ఫ్లైట్ లోంచి కార్ తో జంప్ చేసి.. దాన్ని పారాచూట్ తో రోడ్ పై ల్యాండ్ చేయించి మరీ.. డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయే సీన్స్ హాలీవుడ్ లో తీసేస్తున్నారు.

చదవడానికి వినడానికే కాదు.. ఈ సీన్ చూస్తుంటే సీట్లో లేచి నుంచోవాల్సిందే. మరి మనోళ్లమే అన్నేసి కోట్లు ఖర్చు పెట్టి.. రేసింగ్ థ్రిల్లర్స్ అనే పేరు పెట్టుకుని.. సందుల్లో గొందుల్లో రయ్ రయ్ మనడం.. బాంబులు పేలుతుంటే మైలు దూరంలో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంతోనే సరిపెట్టేస్తున్నారు. ప్చ్.. అప్ డేట్ అవ్వండి మూవీ మేకర్స్.
Full View

Tags:    

Similar News