వరుణ్‌ సారీ చెప్పేశాడు!!

Update: 2017-07-18 16:18 GMT
మొత్తానికి మనోళ్లు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంటుంది. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు చేసే కామెంట్లు అన్నిసార్లు ఆడియన్స్ కు నచ్చేస్తాయని అనుకోవడం భ్రమే. అదిగో మొన్న న్యూ యార్కులో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో కొంతమంది సెలబ్రిటీలు చేసిన కామెంట్లు కామన్ ఆడియన్స్ కు అస్సలు రుచించలేదు. అందుకే ఇప్పుడు ఒక హీరో సారీ చెప్పాల్సి వచ్చింది.

బాలీవుడ్లో అయినోళ్లకు బంధువులకూ స్నేహితులకూ అవకాశాలు ఎక్కువగా ఇస్తారని.. బయటోళ్లను అంత త్వరగా ఎక్కువగా తీసుకోరని కంగనా రనౌత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనినే నెపోటిజం అంటారు. అయితే ఈ నెపోటిజం పై కంగనా అనవసరంగా రాద్దాంతం చేస్తోందంటూ అనేకసార్లు కామెంట్ చేసిన కరణ్‌ జోహార్.. మొన్న ఐఫా అవార్డుల కార్యక్రమంలో కూడా ఇదే చేశారు. నువ్వు మీ నాన్న వలనే హీరో అయ్యావ్ అంటూ వరుణ్‌ దావన్ ను కామెంట్ చేస్తూ.. నువ్వు మీ అమ్మ వలనే హీరో అయ్యావ్ అంటూ సైఫ్‌ ఆలీ ఖాన్ ను కామెంట్ చేశాడు. వాళ్ళు తిరిగి నువ్వూ మీ నాన్న వలనే డైరక్టర్ అయ్యావ్ అన్నారు. ముగ్గురూ కలసి 'నెపోటిజం రాక్స్' అంటూ హంగామా చేసి కంగన పేరును కూడా ప్రస్తావించారు.

ఈ మొత్తం యవ్వారంపై నెటిజన్లు అందరూ బూతులు తిడుతుంటే.. ఇక లాభం లేదనుకుని ఇప్పుడు వరున్‌ ధావన్ రెస్పాండ్ అయ్యాడు. ''నేను న్యూయార్క్ నగరంలో పెర్ఫామ్ చేయడమే నాకు పెద్ద అవకాశం. ఈ సందర్భంగా నా మాటలతో ఎవరినైనా హర్ట్ చేసుంటే క్షమించండి. నేను కావాలని ఏమీ అనలేదు. సరదాగా ఫన్ కోసం చేశానంతే'' అంటూ చెప్పుకొచ్చాడు. కాని వీళ్లు 'నెపోటిజం రాక్స్' అంటూ జోకేశాం అనుకుంటున్నారు కాని.. నిజంగానే అది నిజం కదా. పేరెంట్స్ ఉండబట్టేగా వీరు ఇండస్ర్టీలోకి వచ్చింది. ప్చ్!!



Tags:    

Similar News