ఈ మధ్య కాలంలో తెలుగులో డబ్బింగ్ సినిమాలు ఊహించని విధంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. పేరు తెలియని స్టార్స్ సినిమాలు కూడా తెలుగులో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్నాయి. ఇటీవల 'కాంతార' తరువాత ఉన్నంతలో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన తమిళ డబ్బింగ్ మూవీ 'లవ్ టుడే'. జయం రవితో 'కోమాలి' మూవీని తెరకెక్కించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి పేరు తెచ్చుకున్నప్రతీప్ రంగనాథన్ తనే హీరోగా నటించి, తెరకెక్కించిన మూవీ ఇది.
ఈ కథ పట్టుకుని ఎంతో మంది చుట్టూ తిరిగి చీత్కారాలు ఎదుర్కొన్న ప్రదీప్ రంగనాథన్ చివరికి ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ వారిని ఒప్పించి తనే హీరోగా, డైరెక్టర్ గా ఈ మూవీని రూపొందించాడు.
నవతరం ఆలోచనలని, వారి ప్రేమ కథల్ని ఆధారంగా చేసుకుని నేటి సమాజంలో సెల్ ఫోన్ పోషిస్తున్న పాత్రని కూడా కల్లకు కట్టినట్టుగా చూపించి సరికొత్త కథని ఈ మూవీతో ప్రధీప్ రంగనాథన్ అవిష్కరించాడు. తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ థియేటర్లలో విడుదలై ఈ మూవీ అక్కడ సంచలన విజయం సాధించింది.
కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి తమిళనాట పెద్దగా థియేటర్లు ఇవ్వలేదు. మేకర్స్ కూడా అత్యంత తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. మౌత్ టాక్ సూపర్ బయటికి రావడంతో ఒక్కసారిగా తమిళనాట భారీ స్థాయిలో ఈ మూవీకి థియేటర్లు పెరిగాయి.
దీంతో ఊహించని విధంగా ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని షాక్ కు గురిచేస్తోంది. తెలుగులో ఈ మూవీని దిల్ రాజు రిలీజ్ చేశారు. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆధిపత్యాన్ని చూపించింది.
భారీ వసూళ్లని రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీపై బాలీవుడ్ క్రేజీ హీరో కన్ను పడింది. వరుణ్ ధావన్ ఈ మూవీని హిందీలో రీమేక్ చేయాలని ఆసక్తిని చూపిస్తున్నాడట. త్వరలో ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకోబోతున్నారట. హిందీలో వరుణ్ ధావన్ నటించనున్న ఈ మూవీని ఆయన ఫాదర్ డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేయనున్నడాని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.