ఒక భాషలో హిట్ అయిన సినిమా.. మరో భాషలో మళ్లీ తీయడం రీమేక్ అంటారని మనకు తెలుసు. కానీ ఒక సారి రీమేక్ అయిపోయి, పెద్ద సక్సెస్ కూడా సాధించిన మూవీని.. మరోసారి రీమేక్ చేస్తే.. దాన్ని రీరీమేక్ అనాల్సిందే కదా. ఇప్పుడలాంటి ఫీట్ ను టాలీవుడ్ కింగ్ నాగార్జున మూవీ సాధిస్తోంది. ఇరవయ్యేళ్ల క్రితం ఈవీవీ డైరెక్షన్ లో నాగార్జున డ్యుయల్ రోల్ లో చేసిన మూవీ 'హలో బ్రదర్'.
ఫ్యాన్స్ కే కాదు.. టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెగ నచ్చేసింది ఈ మూవీ. కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హల్ బ్రదర్.. అప్పడే హిందీలో రీమేక్ అయింది. జుడ్వా పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేశాడు. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోకుండా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది జుడ్వా. ఇప్పుడు ఇదే చిత్రాన్ని మరోసారి బాలీవుడ్ లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే.. ఈ సారి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నది కూడా అదే దర్శకుడు కావడం ఆశ్చర్యకరం.
తన కొడుకు వరుణ్ ధావన్ హీరోగా హలో బ్రదర్ ని మరోసారి తెరకెక్కించేందుకు డేవిడ్ ధావన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రాజెక్టు పట్టాలెక్కగా.. మిగిలిన నటీనటులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఏమైనా నాగ్ అప్పటి సినిమాని ఇప్పుడు మరోసారి రీమేక్ చేయాలని డిసైడ్ చేశారంటే.. నాగ్ సెలక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.