కొత్త జంట కన్ఫ్యూజ్ చేస్తున్నారు..

Update: 2015-12-02 07:30 GMT
కుర్రహీరో వరుణ్ సందేశ్, వితిక షేరులకు రీసెంట్ గా నిశ్చితార్ధం అయిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కేయబోతున్నారు ఈ జంట. అయితే. సడెన్ గా డిసెంబర్ 1 ఉదయాన్నే వితిక ఓ ట్వీట్ చేసింది. తన ఫియాన్సీ వరుణ్ కి టైఫాయిడ్ - డెంగ్యూ సోకాయని, డిసెంబర్ 7లోగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పడమే కాదు.. అభిమానులకు కూడా అతని కోసం ప్రార్ధించాలని అడిగింది.

అంతే అయ్యో పాపం అంటూ బోలెడు మంది అభిమానులు - వెల్ విషర్స్ సానుభూతి చూపించారు. తర్వాత రోజు ఉదయాన్నే వరుణ్ సందేశ్ ఓ హాస్పిటల్ నుంచి వస్తూ కనిపించడంతో.. ఫ్యాన్స్ నుంచి ట్వీట్స్ వర్షం ఎక్కువయిపోయింది. అయితే.. సడెన్ గా ఏమయిందో కానీ.. తనకు డెంగ్యూ కానీ - ఇంకెలాంటి వ్యాధి సోకలేదని, జస్ట్ రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లానంతే అంటూ ఈ కాబోయే పెళ్లికొడుకు ట్వీట్ చేశాడు. దీంతో జనాలు కన్ఫ్యూజ్ కావాల్సి వచ్చింది. ఓవైపు కాబోయే భార్య టైఫాయిడ్, డెంగ్యూ అంటుంటే.. కుర్రాడేమో అదేం లేదంటున్నాడు. దీంతో ఎవరి మాట నమ్మాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.  

సాధారణంగా భర్త అవునంటే భార్య కాదనడం, పెళ్లాం అవునంటే మొగుడు కాదనడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి టాపిక్స్ తో బోలెడు సినిమాలు, సన్నివేశాలు చూసేశాం. కానీ ఈ కొత్త జంటకి.. పెళ్లికి ముందే మాటల్లో తేడా వచ్చేసింది. ఇలా ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం ఏమన్నా భావ్యంగా కొత్త జంటకి.

Tags:    

Similar News